Saturday, June 21, 2008

బక్క చిక్కిన ప్రాణం ఆక్రందనలు

దేశం అభివృద్ది చెందుతుంది అని వెర్రి కేకలేస్తున్నారు
దేశం పురోగతి ఎవ్వరు ఆపలేరు అని గర్వపడుతున్నారు
వర్దమాన దేశాలలో కలిసిపోతుంది అని ఆనందపడుతున్నారు

మా బక్కచిక్కిన పల్లెటూరి ప్రాణాలకు అలా కనబడదే దేశం,తేడా ఎక్కడ

మా మసకబారిన కళ్ళలోనా , మీ హాయి జీవితాలాలోనా
నగల కొట్టు రద్దీని దేశాబివృద్ది అనుకొనే మీ ఆలోచనా పరిధి లోనా లేక,
కుటుంబానికి కడుపు నిండా కూడు పెట్టలేని మా నిస్సహయాత లోనా
పందులు తిరిగే ప్రాధమిక పాటశాల కెల్తూ కలక్టేరు అవుతానుకునే మా బుడ్డోల్ల అమాయకత్వంలోనా
పదో తరగతి వెలగబెట్టి వ్యవసాయం నామోషి అనుకునే మా కుర్రకారు మెరిసే కళ్ళేనా
వెడల్పాటి రహదార్లో మీ చిన్న కారులో ప్రయనిస్తూ అమెరికాలో ఉన్నామనుకునే మీ ఊహ సౌధాలేనా


కష్టాలేమని చెప్పాలి ఎన్నని చెప్పాలి, ఎవరిని నిందించాలి
పండించిన పంటకు కనీసం గిట్టుబాటైనా దొరకని దౌర్భగ్యం

కల్తీ విత్తనాలను మాకు అంటగట్టి కోట్లకు పడగలెత్తుతున్న దళారినా
అరికట్టలేని , తెల్లదొరలకంటె హీనం గా చూసే పోలీసునా
ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోకుండా దేశాన్ని కొల్లకొడుతున్న నీచాతినీచుడైన రాజకీయ నాయకుడ్నా

ఎవరు మాకు దారి , ఎవరు తీరుస్తారు మా కష్టాలు
మీ అభివృద్దిలో మాకు చోటు లేదు,స్వంత దేశంలోనె పరాయోల్లం

5 comments:

Kathi Mahesh Kumar said...

అగాధంలా పెరుగుతున్న ‘భారత్’,ఇండియాల తేడాను మనసు నింపుకుని మరీ ఎత్తిచూపారు. బాగుంది.

అక్కడక్కడా అచ్చుతప్పులున్నాయ్...చూసుకోండి. ఇంత మంచి కవిత ఫ్లోని అవి తగ్గకుండా చూడండి.

comment లో word verification తీసెయ్యగలరు.
www.parnashaala.blogspot.com

Bolloju Baba said...

మీ ప్రశ్నలన్నీ సహేతుకమే. మీరు చిత్రించినవన్నీ వాస్తవాలే. కానీ మీప్రశ్నలకు జవాబిచ్చేదెవరు.
జవాబులెక్కడ దొరుకుతాయి.
ఈ వంచన ప్రపంచంలో ఎవరి బ్రతుకు వాడిది. ఎవని పోరాటం వాడిది. ఇక పక్కవాడి గురించి అలోచించే తీరికెక్కడిది?
ఎవరికి వారు తమ కుటుంబాన్ని సంరక్షించుకోవటంలోనే, ముసలివాళ్లయిపోతున్నారు. ఇంక పక్కింటి గురించి ఆలోచించే తీరికెక్కడ? ఓపికెక్కడా?

మీ లాంటి భావుకులు అప్పుడప్పుడు, ఇలా గుచ్చి, గిల్టీ కి గురిచేస్తూంటారు.

నా భావాల్ని వంపేసాను. కొంచం ముతకగా ఉండవచ్చు. మన్నించగలరు.

బొల్లోజు బాబా

Change Maker said...

మహేష్ గారు,
comments లో word verification తీసేసాను. తప్పకుండా తప్పులు రాకుండా వ్రాయటానికి ప్రయత్నిస్తాను. ఒకటి రెండు చోట్ల కొంచెము అతిగా పొయి, పదాలను మార్చేసాను.
చాలా కృతజ్ణతలు

Change Maker said...

బాబాగారు,
బాగా చెప్పారు
సాధారణంగా , మనకి సమాజ సేవ తక్కువ. ఎన్ని వేలున్నా, లక్షలున్నా , కోట్లున్నా మన దానాలు శూన్యం
పిల్లలకైనా సమాజ సేవ గురించి చెప్తే , భావి భారత పౌరులు కొత్త శకానికి నాంది పలుకుతారు
ఎంతటి వారైన , ప్రతి వారు తమకి తోచిన రీతిలో , తమకి వీలైనట్లుగా ఉడుతా సాయం చేస్తే చాలు

అందానికి గంధంలా మనం చదివే వార్తలన్ని సమాజ సేవ ముసుగులో చెసే మోసాలె. చాలా మంది ఆ కారణం గా వెనుకంజ వేస్తారు

మీ వ్యాఖ్యానాలుకు నా కృతజ్ణతలు

Valluri Sudhakar said...

నిస్సందేహంగా దేశాన్ని కొల్లకొడుతున్న నీచాతినీచుడైన రాజకీయ నాయకుడ్నే!