Wednesday, September 30, 2009

చైనా వాళ్ళేమనుకుంటారు మనలను చూసి (మనకు అవసరం అంటారా)

చాలా రోజుల తరువాత వ్రాస్తూ, యువరాజ్ సింగ్ వీరబాదుడ్లోని ఒక సిక్సర్ లాంటి టాపిక్ తీసుకున్నాను (అలా అని చెప్పి నన్ను ఉతికి ఆరెయ్యకండే)

ఈ మధ్య కాలంలోకొంత మంది చైనీయ స్నేహితులతో మాట్లాడుతూ, ఒకానొక సందర్బంలో భారత్ - చైనాల తేడాలమీదకు సంభాషణ మళ్ళింది. వాళ్ళ మాటల బట్టి తెలిసిందేమిటంటే
భారతదేశాన్ని వాళ్ళసలు ఏ మాత్రం లెక్క చెయ్యరని.
వాళ్ళంత అభివృద్ది చెందినా మన ఐటి రంగాన్ని చూసి వాళ్ళకి అసూయ అని

ఇంకా చాల గొప్పలు చెప్పుకున్నారు లెండి (నేను మనసులో అనుకున్నా , మా దేశానికి కూడా టైం వస్తది, మేము గెలుస్తాం ఒలంపిక్ మెడల్స్ మీ లాగా, మేము అభివృద్ది చెందుతాం , పేద ప్రజల కనీస అవసరాలు తీర్చగలుగుతామని ---- మరీ ఎక్కువ అనేసుకున్నానంటారా ..... సారీ , ఆ టైంలో ఆవేశంలో అలా అనేసుకున్నా, లెంపలు వేసుకుంటున్నాను లెండి )
చైనీయులు చాలా తెలివి అయిన వాళ్ళు, సిద్ధాంతాల జోలికి పోకుండా, దేశ అబివృద్ది కోసం, కావల్సిన మార్పులు చేర్పులు చేసుకుని ఈ స్తితికి వచ్చారు. పాతికేళ్ళ క్రితం, భారత్ చైనా తలసరి ఆదాయం సమానం గా ఉండేది, ఈ రోజు మనకి రెట్టింపు.
ఏ ఇజం అయితే ఏముందండి, ప్రతి పౌరుడికి కనీస అవసరాలు తీర్చలేనిది ఏది అయినా వ్యర్దం

మీకు ఎవరకీ నా వాగుడు ఒక్క ముక్క అర్దమైనట్లు లేదు, ఇంక ఊరుకునేది లేదు, తరువాయి కమ్యూనిజమా కాపటలిజమా , మద్యలో ఇంకో ఇజమా
మరింకొన్ని చైనా సంగతులు కూడా