Monday, December 22, 2008

ప్రకృతానందక అవరోధకాలు, వాటి పరిణామాలు

క్రొత్త పరిణామం కొంగ్రొత్త రూపాంతరం

ఎప్పుడూ పరికించని చిన్న చిన్న గుర్తులే అవలోకిస్తే అద్భుతాలే

ఎండిపోయిన చెట్టు కూడా అందంగా కనిపిస్తుంది

ఇన్ని రోజులూ ఎందుకు చూడలేదని చెట్టు చేమలు నిష్టూరాలాడుతున్నాయి

హడావిడి జీవితం అనే సాకు చెప్పి ఏమార్చుదామని ప్రయత్నించా

మరి ఇప్పుడు ఎలా గోచరిస్తున్నామనంటే ఏమని చెప్పను

పొరలు కమ్మి చెదలు పట్టిన మనసు ఒక్క సారిగా

కమ్మిన పొరలను చేదించుకుని అంతరిక్షంలోకెళ్ళి భూమిని చూస్తున్న అనుభూతి

మనసులోని ఆలోచనలను పరిమితం, సంకుచితం చేసిన అవరోధకాలు మటుమాయం

లోకం కొత్తగా కనిపిస్తుంది, మనుషులు కొత్తగా కనిపిస్తున్నారు

కూలంకషగా పరిశీలిస్తున్నా కంటికే కనబడేవాటినన్నిటినీ

ఉన్న స్థానం నించి సూటిగా ఆకాశంలొకి ఒక గీతని గీస్తే

అనంతాకాసంలొ ఎక్కడో అన్ని గీతలు కలిసే చోటునుంచి

చూస్తున్నా ఈ విశ్వాన్ని , జీవితాన్ని ,జీవితపు మలుపులను ,గమ్యాన్ని

రమణ మహర్షో, జిడ్డు కృష్ణమూర్తిగారో కలలోకి వచ్చి జీవిత పరమార్ధం బోదించినట్లు

జీవితం చాలా అందమైనది, జీవిత కాలం చాలా తక్కువ

చుట్టూ ఉన్న సుందర ప్రపంచాన్ని వదలి, కక్షలు కార్పణ్యాలతో, మనస్పర్ధలతో

జీవితాన్ని వృధా చేసుకోవద్దని అవగతమైంది

.........................................................ప్చ్ ఇంక కేస్ కొట్టెయ్యచ్చంటారా

2 comments:

Anonymous said...

బహు చక్కని పరిణామం. ప్రకృతికెంతో ప్రమోదం. సృష్టికర్త తాను కల్పించిన అందాలన్నీ ఒకచోట ప్రోగేసి స్త్రీని మలిచాడట. ఆమెకే దక్కని ఆ అపురూప స్థానం తనలో భాగమైన ఈ చెట్టుచేమలకీ దూరమవడం ఏం విడ్డూరం కాదు కదండీ! స్త్రీ జన పక్షపాతిని, అలవాటుగ ఆ త్రోవనే వెళ్ళాను? :)
ఇంకా ఇంకా మీ కలం నుండి మీ భావాలిలాగే జాలువారాలి.

నేస్తం said...

chaalaaa baaga raasaaru