Wednesday, March 31, 2010

దూరం దగ్గర మనం అనుకునేది మనకు అనిపించేది

దూరం దగ్గర మనం అనుకునేది మనకు అనిపించేది
ఒక క్షణం దూరం అనిపించే బందం
ఇంకోక్షణం దగ్గర అనిపించే అనుబంధం హృదయం చేసే గారడీ
తోడి చూస్తే హృదయపు లోతుల్లో ఉండే బంధం
దూరం పెరిగినా తీరం చేరినా మారని బంధం
తరచి తరచి ప్రశ్నించినా మారని బంధం
ఆడంబరాలు లేని బంధం
విచిత్రమైన బంధం

6 comments:

roni said...

chaalaa baavundinkavitha

భావన said...

బాగుంది అండి. చాలా టచీ గా వుంది.

Change Maker said...

రోని, ధన్యవాదాలు

Change Maker said...

భావన గారు, ఏదో ఊరికె అలా వ్రాసుకుంటూ పోయా. మీరంతలా అన్నారంటే బానే వచ్చిందన్నమాట. ధన్యవాదాలు.

maa godavari said...

బాటసారి గారూ
నమస్కారం.మీరు నా బ్లాగ్ సందర్శిచి కామెంట్ పెట్టినందుకు ధన్యవాదాలు.
మీ అమ్మ గారి గురించి చదివి చాలా బాధపడ్డాను.ఆవిడ తనకు తగిలిన గాయాన్నుంచి కోలుకుని
సమాజ సేవకు అంకితమవ్వడం చాలా సంతోషకరమైన విషయం.
మీ అమ్మ గారు ఎక్కడుంటారు?హైదరాబద్ లో అయితే నేను కలవగలను.
భూమికలో ఆవిడ ఇంటర్యు
వేస్తే బావుంటుంది కదా.
నేను సమస్యల్లో ఉన్న మహిళల కోసం ఒక హెల్ప్ లైన్ నడుపుతున్నాను.
1800 425 2908 (040 27605316)
మీరు ఈ నంబర్ కి కాల్ చెయ్యొచ్చు.
www.bhumika.org

Change Maker said...

సత్యవతి గారు, మీ సమాధానికి ధన్యవాదాలు. మీరు సమస్యలలో ఉన్న స్త్రీల కోసం నడుపుతున్న హెల్ప్ లైన్ చాలా గొప్ప విషయం. మీ సంస్థ ఆపదల లో ఉన్న అభాగ్యులందరికీ చేయూత నిచ్చి, వారి కష్టాలను వారే ఎదుర్కొనే ధైర్యాన్ని ప్రసాదిస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాను మీరు చేస్తున్న కృషి ఇంకా ఎందరికో స్పూర్తి దాయకం కావాలని ఆశిస్తున్నాను.

మా అమ్మగారు హైదరాబాద్ లొనే ఉంటారండి. మిమ్మల్ని తప్పకుండా కలుస్తారు. మీలాంటి మంచి వారిని కలవటం అదృష్టం. తప్పకుండా ఇంటర్వ్యు వెయ్యండి. చదివిన వారందరికీ స్పూర్తిదాయకం అవుతుంది.