వీడికి పరుగు, వ్యాపారం తప్పితే ఇంక వేరే ఏమీ లేవు అనుకోకండి. నా బతుకే ఒక పరుగైపోయింది.
ఇండియా లో ఉన్నప్పుడు కొంచం వర్షం తో వాతావరణం చలిగా ఉందంటే బిర్యాని లాగించి వెచ్చటి రగ్గు కప్పుకుని మునగదీసుకుని పడుకున్న రొజులు ఎన్నో.అలాంటి నాలాంటి అరివీర భయంకర బద్దక చక్రవర్తి, తనంతట తానుగా మూడు నాలుగు గంటలు అలా పరిగెట్టేస్తుంటే, నా స్నేహితులకు చాలా అనుమానాలు వచ్చాయి. ఒకడడిగాడు, ఏరా దారిలో నిద్ర పోతావా అని. ఇంకోడు అన్నాడు, నీకేమైన పిచ్చా , కోరి కోరి ఎవడైనా నాలుగు గంటలు పరిగెడతాడు రా. ఏమి చేస్తాం అని ఊరుకుంటున్నా.
ఇప్పుడు పద్ధతి మార్చా, పరిగెత్తుకొచ్చి బిర్యాని తిని, రిలాక్స్ అయిపోతున్నా.
ఒక ఎనిమిది మంది స్నేహితులకు అంటించా. వాళ్ళూ నడుస్తూ పరిగెట్టటానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళను తలుచుకుంటే జాలి వేస్తుంది. వాళ్ళు పరుగులో (ఊబిలాగా) కూరుకుపోతున్నారని తెలియదు. వాళ్ళు బ్లాగులు చదవరు. చదివిన మీరెవ్వరూ వాళ్ళకు తెలియదు. నాకో పెద్ద ఫాలోయింగ్. వాళ్ళకు పెద్ద ఫోజ్ గా సలహాలు ఇస్తూ ఉంటా.
ఇంకా నెల రోజులే ఉంది. ప్రాక్టీస్ సరిగ్గా లేదు ఇప్పటి వరకు.
ప్రతి వారం పరుగు ప్రణాళిక ఇలా ఉంటుంది
సోమ వారం - 4 మైళ్ళు
మంగళ వారం - స్ట్రెంగ్త్ ఎక్సర్సైజ్
బుధ వారం - 6 మైళ్ళు
గురు వారం - 5 మైళ్ళు
శుక్ర వారం - 6 మైళ్ళు
శని వారం - 10 మైళ్ళు (మారథాన్ దగ్గర పడుతున్న కొద్దీ ఓ రెండు శని వారాలు 20 మైళ్ళు పరిగెత్తాలి )
ఆది వారం - విశ్రాంతి (తెగ పరిగెట్టేసామని)
Friday, February 26, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment