ఎన్నో జీవితాలు నలిగిపోతున్నాయి కుటుంబ సమస్యలతో.
కలసివుంటే కలదు సుఖం అనేది అందరికి తెలిసినదే.
చిన్న చిన్న విషయాలను గోరంతలు కొండంతలు చేసి, తమకి తామే తెలియకుండా హాని చేసుకుంటున్నారు.
క్షమించే గుణం లేకపొవడం, తాము తప్పు చెయ్యమని, తనవాళ్ళూ తప్పు చెయ్యరనే
మొండి నమ్మకం చాలా సమస్యలకు హేతువౌతుంది.
ఎంతో అభివృద్ధి చెందాల్సిన ఎంతో మంది, కుటుంబ సమస్యల వల్ల ముందుకు వెళ్ళలేకపోతున్నారు.
నిరాశ నిస్పృహలతో గమ్యం చేరుకోలేకపోతున్నవారు కోకొల్లలు.
ఇంట్లో రోజూ కొట్టుకు చస్తుంటే ఇంక ఏ మనిషైనా బయట సాధించేదేముంది?
చాలా వరకు ఇతరుల మీద ద్వేషం తమకే ఎక్కువ హాని చేస్తుందన్న విషయాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారంతా.
స్వతహాగా సాధులక్షణాలు కలవారు కూడా సహవాస దోషంతోనో,
పరిస్థితుల ప్రభావానికో ఈ కుటుంబ కలహాలలో పెద్ద పాత్రనే వహిస్తున్నారు.
సామరస్యంగా ఉంటే కలిసి బాగుపడతామనే ధ్యాసే లేదు.
ఒక చోట ఒక అత్త కారకురాలైతే, ఇంకొక చోట కోడలు కారకురాలు.
ఒక చోట ఒక అన్న కారకుడైతే, ఇంకొక చోట ఒక తమ్ముడు కారకుడు.
ఇలా ఎంతో మంది కారకులు ఎంతో మంది బాధితులు.
రోజు రోజుకీ ఈ చాప కింద నీరు లాంటి సమస్యలు ఎక్కువౌతున్నాయి.
చదువులు వ్యక్తిత్వాన్ని పెంచట్లేదు.
రాజీ పడే వారు తమ మనస్తత్వాన్ని చంపుకుని కాలం వెళ్ళబుచ్చుతున్నారు.
చిన్న చిన్న తప్పులను బట్టే మనుషలను చెడ్డగ జమ కట్టి,
వేరొక అవకాశం ఇవ్వని స్వభావం ఎన్నో సమస్యలకు హేతువు.
మన సమస్యల్లో మన పాత్ర ఎంతో, ఒక్క సారి ఆలోచించండి !
Thursday, January 15, 2009
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
బాగుందండి. సమస్యతో రాజీపడకుండా, అలాగని పూర్తిగా వదిలివేయకుండా, ఒక అనుకోని అతిథిని ఆహ్వానించి, ఆదరించి, సాగనంపినట్లుగా treat చేస్తే మన పాత్రకి న్యాయంచేసినవారమౌతాం. నిజానికి మన సమస్యకి మనమే కారణమన్న మౌలిక సూత్రం పాటిస్తే సగం ద్వేషభావాలు తొలగిపోతాయ్.
బాగా చెప్పారు :)
అవునండీ,
మీరు చెప్పినది నిజం,నేను ఇలాగే ఆలోచించి నా తమ్ముడు చేసిన తప్పు ముందు తెలుసుకున్నాను. ముందు వాడిని నా control లోకి తెచ్చుకుని తరువాత నా మరదలి వైపు ఆలోచించాను.అప్పటికే నష్టం జరిగిపోయింది.ఇరువైపులా గాయాలే మిగిలాయి.ఇపుడు మందు వేసే పని చేస్తున్నాను.అన్నిటికి కాలమే సమాధానం చెప్పాలి.నా వంతు ప్రయత్నం sincere గా చేస్తున్నాను.
నీహారిక గారు, సమస్య పరిస్కారానికి మీ వంతు కృషి మీరు చెయ్యండి. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి
Post a Comment