Friday, January 30, 2009

ఇండియన్స్ మారథాన్ పరిగెట్టలేరన్న మాటకి ఒక జమైకన్ కి కోపం వచ్చిన వైనంబెట్టిదనిన

నా స్నేహితుడు ఒక ఆయన మా ఊరి యూనివర్సిటీ లొ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. ఆయన స్వస్థలం జమైకా, ఆయనకి పరిగెట్టడం చాలా ఇష్టం, అది అంతా ఇంతా కాదు, ఆయనలా  గంటలు గంటలు ఆనందంగా పరిగెట్టే వాళ్ళని నేను ఇంత వరకు చూడలేదు ఎప్పుడూ.

ఈ జమైకా వాళ్ళంతా ఇంతే అనుకుంటా,  మొన్న ఒలింపిక్స్ లో చాలా వేగంగా పరిగెట్టిన ఉస్సైన్ బోల్ట్ కూడ అక్కడనుంచే. బోల్ట్ మరీ దారుణం ఏమిటంటె,  100 మీటర్లు డాష్ లో ఫినిషింగ్ లైన్  కంటే ముందే సెలబ్రేషన్ మొదలు పెట్టేసాడు.  100 మీటర్ల పోటీ లో గెలుపు మార్జిన్ చాలా తక్కువ ఉంటుంది. అలాంటిది ఈయన గారు ఇంకో 5 మీటర్లు ఉందన గానే పండగ చేసుకోవటం,  చరిత్ర లో మళ్ళా జరగక పోవచ్చు.

సరే మళ్ళా మా స్నేహితుడి సంగతికి వద్దాం.  ఆయన ఇప్పటి వరకూ  ఓ వంద మారథాన్ల  లో పరిగెట్టారు. తాడిని తన్నే వాడుంటే వాడి తలను తన్నే వాడుంటాడులా,  నేను పరుగెడుతున్న మారథాన్ 26.2 మైళ్ళు ఉంటే,  దీని కంటే దూరంవి 50మైళ్ళు పరుగు, 100మైళ్ళు పరుగులు కూడ ఉన్నాయి. 100 మైళ్ళ పరుగు ఉపయోగం ఎమిటంటే వైజాగ్  నించి రాజమండ్రి వెళ్ళటానికి బస్ ఎక్కక్కర్లేదు, పరిగెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు.

మా ప్రొఫెసర్ గారు 50మైళ్ళ పరుగు పరిగెట్టారు , ఆయనకు 100 మైళ్ళ పరుగు ఒక గోల్.

ఇంత పరుగరి దగ్గర కొంత మంది  పిహెచ్.డి  విద్యార్థులు ఉన్నారు. వారిలో  ఒక భారతీయుడు కూడా ఉన్నాడు.

మొన్న జరిగిన చైనా  ఒలింపిక్స్  లో ఇండియా ప్రదర్శన  గురించి  ఇద్దరి మథ్యా జరిగిన సంభాషణలో , ఆ యువకుడు తేల్చి  చెప్పాడంట, భారతీయులు పరిగెట్ట లేరని, మారథాన్లు  అస్సలు పరిగెట్టలేరని. (అది ఆ అబ్బాయి అభిప్రాయం, మన గురించి మనకే చిన్న చూపు అనే టాపిక్ తరువాత చూద్దాం, ఇప్పటికి వదిలెయ్యండి అతనిని).

ఆ మాట విని మా ప్రొఫెసర్ గారికి  తిక్క లేచింది. 

ఆయన కంకణం కట్టుకున్నాడు, ఎలా అన్నా నాతో మారథాన్ పరిగెట్టించి , ఇండియన్స్ కూడా పరిగెట్టగలరని నిరూపిద్దామని.

నేను మారథాన్ పరిగెట్టటం అంటే ప్రపంచ వింతలలోకి ఎక్కించెయ్యొచ్చు.
----------------------------------------     వివరాలు తరువాతి పోస్ట్ లో.

6 comments:

Anonymous said...

ikkada america lo mana indians marathons lo parigettadam nenu choosaanu. ee sangathi mee friend ki cheppi, meeru bayatapadochemo aalochinchandi :P
just kidding, keep the sprits up to reach yours and your friends goal :)

శ్రీ said...

మా అఫీసులో 50 ఏళ్ళ ఆయన 10, 20 మైళ్ళు మారధాన్ చేస్తాడు. మీరు పందెం కాయండి, నేను మనుషుల్ని 2 లారీలొ వేసుకుని వచ్చేస్తా.

Anonymous said...

అన్నిటికన్నా ముందుగా చక్కని చతురోక్తులతో చాలా సరళమైన శైలిలో సూటిగా చెప్పిన మీ తీరుకి జోహారు.

ఎంత చక్కటి వైనం. ధ్యేయాలు,వాటి సాధనలు, సహకారం వంటి స్ఫూర్తిదాయక పనులకి జాతి, దేశం వంటివి అడ్డుగోడలు కావని చూపుతున్నారు మీ ప్రొఫెసరు గారు. మీరు ధన్యులు.

నేను కూడా ఆయనకి ద్రోణునికి ఏకలవ్యుడిలా మారిపోయానండోయ్. ముందు నా 5 మైళ్ళ నడకని పునఃప్రారంభిస్తాను. అల్ల ఎప్పటికో ఒకరోజు ఆయన వెంట పరులుతీస్తాను.

Anonymous said...

.... సశేషంగా పైన వదిలిన వ్యాఖ్యకి ఇది ముగింపు. అలా ఎప్పటికో ఒకరోజు ఆయన వెంట పరుగులు తీస్తాను. నేనూ మీ మాదిరి మరి కొన్ని టపాలు వ్రాస్తాను. అందాకా మీ కబుర్లు కోసం చూస్తుంటాను.

Sudhakar said...

మొన్న సింగపూర్ లో స్టాండర్డ్ చార్టర్డ్ బాంక్ వారి 42.5 కిలోమీటర్స్ మారథాన్ లో చాలా మంది ఇండియన్స్ పరిగెత్తాం.And most of us have finished the distance

నేస్తం said...

ఇదేం బాలెదండి.. ఏం జరిగిందొ చెప్పకుండా టెన్షన్ పెట్టడం .. :O ..బాగా రాసారు :)