Monday, May 26, 2014

రెండు క్రొత్త రాష్ట్రాలు -- వాటి అభివృద్ది

ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు కొత్త నాంది , కొత్త శకం

అభివృద్ది సామాన్యుడి కి చేరాలంటే తాతలు దిగి రావాలి

KCR కంటే CBN కి ప్రగతి చూపించటం సులభం, ఎందుకంటే అంతా కొత్త నిర్మాణం కాబట్టి.

Good luck to both states and wish a tremendous growth to both of them

Sunday, May 25, 2014

Lean Startup

Lean Startup -- http://theleanstartup.com/
I have been following these principles to build my startup.
I will be sharing my experiences and my journey.

Steve Blank's customer development is a must follow for any web startups
  http://steveblank.com/2010/02/25/customer-development-for-web-startups/




Tuesday, February 8, 2011

ఈజిప్ట్ విప్లవంలో ఆందోళనకారులు పాడుతున్న సామూహిక గీతం

గత పద్నాలుగు రోజులుగా ఆందోళనకారులు కైరో నగరంలోని ఆందోళన చేస్తూ పాడుకుంటున్న సామూహిక గీతం ఇది.ప్రతి విప్లవానికి ఇలాంటి పాట ఒకటి ఉంటుంది. అందరూ అది పాడుకుంటూ తమ పోరాటాన్ని సాగిస్తుంటారు.

బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లో పోతావ్ కొడకో నైజాము సర్కరోడా
Ramy Donjewan sang it and kind of means

Your blood, the government’s shedding it,
Your nation, they’ve exhausted it.
Your religion, they’ve targeted it.
Your portion…they’ve swallowed it.”

Target $10000 ఇప్పటి వరకూ వచ్చినవి $4000

గొడిచెర్ల బిగ్ హెల్ప్ ప్ర్రాజెక్ట్ కి 4000 డాలర్స్ వచ్చాయి. ఇంకా నా పరుగు రమారమి మూడు నెలలు ఉంది. ఈ మూడు నెలలలో 6000 డాలర్స్ raise చెయ్యాల్సి ఉంది. just to give an update on my progress. I will provide more details on the progress.

నేను ఇదంతా చేస్తున్నది పేరు ప్రతిష్టలకోసం కాదు.నా వంతుగా నా దేశానికి నేను చేస్తున్న కనీసధర్మం.
ఇంత టామ్మ్ టామ్మ్ ఇవ్వకుండా నువ్వు చేసేది నువ్వు చెయ్యొచ్చుకదా అనే వారు ఎక్కువ అయ్యారు. అమ్మ పెట్టదు, అడుక్కు తినానివ్వదు అన్నట్టు గా

నేను వ్రాసినది చదివిన ఒక్కరైనా ప్రేరణ పొందుతారనే ఉద్దేశ్యంతో వ్రాస్తున్నాను. ఇప్పటి వరకు స్పందన నేను ఊహించిన దాని కంటే ఎక్కువే వచ్చింది.

ఇంకొంతమందైనా స్పందిస్తారని, తమకి ఉన్నంతలో తోచినంత సహాయం, తమకి నచ్చిన సంస్థల ద్వారా చేస్తారని ఆశిస్తున్నాను.
సహాయం ధనరూపేణా నే అక్కర్లేదు, వేర్వేరు విధాలగా చెయ్యొచ్చు

Visit www.bighelp.org

Saturday, January 29, 2011

We No Speak అమెరికానో -- 20 దేశాలలో పెద్ద హిట్ పాట, బీట్ బావుంటుంది. వినండి

ఆష్ట్రేలియన బాండ్ 1956 ఇటాలియన్ పాట ఆధారంగా చేసినది. బీట్ చాలా నచ్చింది. ముఖ్యంగా ఒక నిమిషం తరువాత వచ్చే బీట్.

Band Yolanda_Be_Cool


Friday, January 28, 2011

మారతాన్ పరుగు -- పరుగుతో బాటు ఒక బృహత్తర కార్యం

మూడవ మారతాన్ పరిగెడుతున్నాను April 30th

ఈ సారి పరుగుతో బాటు ఒక బృహత్తర కార్యం చేపట్టాను. గొడిచెర్ల మా స్వంత ఊరు. అక్క్డడ ఉన్నా ప్రాదమిక పాఠశాలను మెరుగుపరుద్దామనుకుంటున్నాను. ఇంత కష్టపడి 50 కిలోమీటర్లు పరిగెడుతున్నాను కదా. ఆ కష్టాన్ని చెప్పుకుని స్నేహితులు, చుట్టాల దగ్గర డబ్బులు గుంజుతున్నాను (ఉన్నంతలో ఉదారంగా ఇస్తున్నారు)

నేను నా స్నేహితులు కలిసి బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ అనే ఒక సంస్థను స్తాపించాము ఓ పది సంవత్సరాల క్రింద . మేము ఇప్పటివరకు ఏమి చేసామో ఆ వివరాలు ఇక్కడ చూడవచ్చు www.bighelp.org !

మా ప్రాజెక్ట్స్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోనూ ఉన్నాయి


రమారమిగా మన గ్రామాలలో పాఠశాలలు ఇదేవిదం గా ఉన్నాయి


ఎదురుగా కనపడుతున్న అరుగు మీద పేకాటరాయుల్ల పారాయణం సాగుతుంది. ఫొటో తేసే సమయానికి ఎవ్వరూ లేరు. చూసే అదృష్టం మీకు లేదు ప్చ్చ్చ్ !!!!!!!

ఇదీ ఆ పాఠశాల


నా ప్రయత్నాలు ఎలా సాగుతున్నాయో, పాఠశాలకు ఏ విధమైన మార్పులు చేర్పులు చేస్తున్నామో చెప్తూ ఉంటాను

spending money on infrastructure is very easy. But improving the quality of education is the toughest part. Lack of teachers and the absenteeism of the teachers compound the problems.

Poorest of poor kids are attending our schools in the village.
They deserve a better schooling. It is our responsibility to make sure that it happens

Tuesday, January 25, 2011

మనమేమి చేసాం మన దేశానికి మన ప్రాంతానికి, మన ఊరికి

ఈ పోష్టును విమర్శగా కాకుండా, క్రియాత్మకంగా, నిర్మాణాత్మకంగా తీసుకోవాలని ప్ర్రార్ధన.

ప్రతీ గణతంత్రరోజుకు శుభాకాంక్షలు చెప్పుకుంటాం. నెలలు గడుస్తాయి, స్వాతంత్ర్య్ దినోత్సవం వస్తుంది అది జరుపుకుంటాము. ఇలా సంవత్సరాలు గడుస్తుంటాయి. మనకి వయసు పెరుగుతుంటుంది. మన అభివృద్ది చూసుకుంటూ ఉంటాం. మన సంపద, మన సుఖాలు అంతా మనే నడుస్తుంటుంది.

ఒక నిమిషం ఆగి ఒక ప్రశ్న వేసుకుందాం. మనమేమి చేసాం మన దేశానికి అని.

మీ వంతుగా మీ జీవితంలో ఏమి చేసారు దేశం కొరకు ఇంతవరకు, చెప్పండి. ఒక వేళ ఇప్పటి వరకు చెయ్యకపోయినా, ఒకటి రెండు సంవత్సరాలలో ఏమన్నా చేద్దామనుకుంటున్నా చెప్పండి. కుతూహలంగా ఉంది. మీరు చెప్పేవి వేరందరికీ స్పూర్తినిస్తాయి.

ఏమన్నా చేయగల అవకాశం ఉందేమో అని ఆలోచించండి.తప్పకుండా ఏదో ఒకటి ఉంటుంది మీరు చేయగలిగింది.

నీకెందుకు చెప్పాలి అని అడుగుతున్నారా?
ఇష్టం లేకపోతే నాకేమి చెప్పక్కర్లేదు.మీకు మీరే ఆలోచించుకుని మీతోనే చెప్పుకోండి ఏమి చేసారో.

అసలు దేశానికే నేను చెయ్యాల్సిన అవసరమేమిటంటారా? అదే, నా కేమి పని అని?
దేముడిని నమ్ముతారనుకోండి -- పుణ్యం వస్తుంది అని చెప్తాను
దేముడిని నమ్మరనుకోండి -- పేరు ప్రతిష్ఠలొస్తాయి అని చెప్తాను

ఏహ్ చల్ తియ్ , ఏందీ లొల్లి అన్నారనుకోండి -- దానికి సంజాయించే తరీఖా అలగ్ ఉంది. అది ఇప్పుడు చెప్ప.

నేను సంపాదిస్తూ, ఆ సంపాదనను ఖర్చు పెడుతూ, దుకాణాలను పోషిస్తూ, ఆర్దికవ్యవస్త నడవటానికి సహయపడుతున్నాని మాత్రం చెప్పొద్దు. అది కాకుండా ఇంకేవైనా. నేను దేశపరిస్థుతల గురించి తిండి నిద్రలు మానేసి బాధ పడుతుంటాను కూడా పని చెయ్యదు. రాజకీయ నాయకుల అవినీతి, అసమర్దత, దగుల్బాజీతనం, బేవార్సు తనం గురించి నిప్పులు చెరుగుతాను కూడా, నయి జాంతా. ఇవి కాకుండా వేరేవి చెప్పండి.

It need not be a physical act. Any thing that helped the country, anything that lays the foundation for a better future

ఇదంతా చదివిన తరువాత మీకు వచ్చే మొదటి ప్రశ్న : నువ్వు ఇన్ని కబుర్లు చెప్తున్నావు కదా, నువ్వేమి పీకేవని? (ఓ ఐదేళ్ళ క్రితమైతే , నువ్వేమి చేసావని అడిగే వాళ్ళు, ఇప్పుడు భాష మారింది , అంతా పీకుడే)

నా వంతుగా నేనేమి చేసానో, చేయబోతున్నానో చెప్తాను చివరాఖరున.

జై హింద్

ఎముకలు కొరికే చలిలో నా పరుగు

గత మూడు సంవత్సారాలుగా పరిగెట్టడం ప్రారంభించాను. వేసవకాలంలో పరుగు పర్వాలేదు కానీ శీతాకాలంలో బయట పరుగెట్టటం ఒక సాహసం. పరుగు యంత్రం (ట్రెడ్ మిల్) మీద గంటలు గంటలు పరిగెత్తడం విసుగు.

ఇంతక ముందు పరుగులన్నీ ఒక ఎత్తైతే, మొన్న వారాంతం (వీకెండ్) పరిగెట్టిన రెండు గంటలు ఒక మేలితావు. భయంకరమైన చలిలో పరుగు

సమయం -- ఉదయం 8 గంటలకు
ఉష్ణోగ్రత -- 5 degrees farenheit (-15 degrees centigrade)
గాలి ఉత్సాహం (wind chill) -- వీసే గాలికి చలి ఇంకా ఎక్కువ అనిపిస్తుంది, ఉష్ణోగ్రత ఇంకా పడిపోతుంది
(ఇలాంటి చలిలో కోటు లేకుండా పదినిమిషాలు బయట నిలబడితే ముక్కు కానీ , చెవి కానీ విరిగిపడుతుందని చెప్తారు,(నేను ప్రయత్నించలేదు కాబట్టి నాకు అనుభవపూర్వకంగా తెలియదు))

చలికి సరి పడిన వస్త్రాలు వేసుకుంటాం కాబట్టి అంత కష్టం అనిపించదు. పరుగు మొదలుపెట్టిన ఐదు నిమిషాలు కొంచం కష్టంగా ఉంటుంది కానీ, తరువాత శరీరం నుంచి పుడుతున్న ఉష్ణం అలవాటు చేస్తుంది. తరువాత పరుగులో పడి చలి మర్చిపోతాం.చలికి తోడు, దారిలో ఉన్న గడ్డకట్టిన మంచుకి దొరికిపోకుండా చూసుకోవాలి. జారితిమిపో, నడ్డి విరుగుట కాయం.

హాయిగా ముసుగుతప్పి పడుకోక, ఇదంతా అవసరం అంటారా? నేనూ పూర్వాశ్రమంలో, చలిగా ఉందని, ముసుగుతన్ని కార్యాలయం (ఆఫీస్) కు ఎగనామం పెట్టిన రోజులు కోకొల్లలు. దేశాలు మారినా, ఖండాలు మారినా, పుట్టకతో వచ్చిన బుద్ది కాబట్టి తూచాతప్పక పాటించేవాడిని.

పరుగు అంతా అయినతరువాత వచ్చే సంతృప్తి వెలలేనిది. మొన్న చేసిన సాహసకార్యం చాలా సంతృప్తినిచ్చింది.

మరి నా కోరి తెచ్చుకున్న కష్టాలు చదివారు కదా , నా గురించి జాలిపడుతూ మీరు ఉంటున్న వెచ్చటి వాతావరణం లో , ఓ నడకకో పరుగుకో వెళ్ళొచ్చు కదా. కాస్త లేవండి మరి.

Sunday, January 23, 2011

తెలుగు బ్లాగ్ గేట్ - పెద్ద కుంభకోణం - కుకుదారుడు

నాకు కుంభకోణం కుట్రదారుడికి (కుకుదారుడు) ఏ విధమైన పరిచయం లేదు, వైరం లేదు , never crossed paths.
నేను ఒక సగటు బ్లాగ్ చదువరిని. వళ్ళు బద్దకం వల్ల వ్రాయటం అతి అరుదుగా జరుగుతుంటుంది. నేను చదివే కొన్ని బ్లాగులలో కుకుదారినివి కూడా వున్నాయి.

ఏ మాటకామాట చెప్పుకోవాలి. కుకుదారుడు చాలా తెలివైన వాడు, విజ్ఞానవంతుడు. తెలుసుకున్న విషయాలనుంచి, వివిధ పాత్రలను సృష్టించి , తెలుగు సినిమా డైరెక్టర్లకంటే గొప్పగా వాటిని దేశ విదేశాలు తిప్పి, ఒక అఖండ కావ్యం చేసాడు. అది మటుకు మెచ్చుకో దగ్గ విషయం.

ఎంత మందిని మోసం చేసాడు, ఏమి మోసాలు చేసాడు నాకు తెలియదు. ఎవరికీ తెలియకపోవచ్చు ఎందుకంటే మనల్ని ఒకరు అడ్డంగా మోసం చేసారని చెప్పుకోలేక పోవటం చాలా సహజం. మన అహం అడ్డు వస్తుంది. In this saga, everybody was taken for a ride, some more some less.

As days pass by, perpetrator will be part of history. He will try to resurrect himself in different avatars. Even during these days of damage control, he will not sit quite, he will adopt different strategies. (ఇదంతా తెలుగులో చక్కగా వ్రాయటం రాలేదు)

ఇప్పటికైనా కుకుదారుడు , తన మోసాన్ని గ్రహించి (ఇది జరగకపోవచ్చు) , తన ప్రతిభను తన, తన కుటుంబ అభివృద్దికి ఉపయోగించుకుంటాడని ఆశిస్తున్నాను.

జరిగినవి, బయట పడిన తరువాత బ్లాగ్జనుల ప్రతిస్పందనలు, కొత్త కొత్త పాత్రల ప్రవేశం,గుంపు లో ఉన్నప్పుడు మన ఆలోచన విధానం, ఒక తటస్థ ప్రేక్షకుడిగా నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి, బద్దకాన్ని వదిలించి ఈ పోష్టుని వ్రాయించాయి.

-- (ఈ కుంభకోణం గురించి తెలియని వారికి -- ఒక కుకుదారుడు , వివిధ అవతారాలతో ఒక విషవలయాన్ని సృష్టించి జనాలను మోసం చెయ్యటం అదన్న మాట)

గమనిక : నా అభిప్రాయంలో తెలుగు బ్లాగ్ వాతావరణం అహ్లాదకరంగా లేదు. పరస్పర దూషణలు, బూతులు, ఒకరినొకరు గౌరవించుకోకపోవటం గర్హనీయం. అందరూ చదువుకున్న వారే కదా, మన విలువైన సమయాన్ని ఇలా ద్వేషపూరితంగా వృధాచెయ్యటం మనకే నష్టం . (ఇది ఎవరినీ ఉద్దేశించినది కాదు, నా పరిశీలన మాత్రమే)

Waiting for the next blog shobaraj

Wednesday, January 19, 2011

తెలుగు బ్లాగ్ గేట్ - పెద్ద కుంభకోణం

తెలుగు బ్లాగ్ గేట్ అంటే ఏదో కొత్త సంకలిని అనుకునేరు. అదేమి కాదు. పెద్ద పెద్ద కుంభకోణాలకు, మోసాలకు అమెరికాలో గేట్ అని వెనకాల తగిలిస్తారు. Watergate తరువాత ప్రారంభం అయ్యింది ఈ ఆనవాయితి. అందుకే ఈ బ్లాగ్ కుంభకోణానికి వెనుక గేట్ చేర్చా.

తెలుగు బ్లాగ్ జనులను మభ్యపెడ్తున్న నాటకానికి తెర పడింది ఈ రోజు. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాను, ఎప్పుడు ఈ భండారం బట్ట బయలు అవుతుందని. తమకి ఉన్న తెలివితేటలను అమాయకప్రజలతో ఆడుకోవటానికి కాకుండా, మంచి పనులకో, తమ అభివృద్దికో ఉపయోగించకుండా, ఇలా వేరు వేరు పేర్లతో ఒక మాయాజాలాన్ని సృష్టించి ఏమి బావుకున్నారో నాకైతే అర్ధం కాలేదు.

తెలుసుకున్న వారంతా విభ్రాంతి చెందుతారు, భాధ పడతారు, కొందరు అసహ్యించుకుంటారు

భారతీయ గూడచారి విభాగం లో పనిచేసే మేజర్ చంద్రకాంత్ నాకు చెప్పిన దాని ప్రకారం ఈ గూడుపుఠాణంతా గుంటురు లో ఒక IP address నుంచి జరిగిందంటా. ఏమిటి నమ్మట్లేదా, ఆ పేరు చెప్పగానే మీకు అన్నగారి సినిమా గుర్తు వస్తుందా. నా ఖర్మ, ఇదికూడా గొప్పగా చెప్పటం రావట్లేదు. దేనికైనా talent ఉండాలి.

PS: Forgot to tell you, I am just typing this from the meeting of Goldman Sachs and Reliance group on a two billion dollar buyout deal. (dont you believe me, ??)

Monday, April 26, 2010

మారథాన్ కు ఇంకా 5 రోజులు , May1st 7:30AM

మారథాన్ కు ఇంకా 5 రోజులు ఉంది. మా ఊరిలో ఇది రెండో సంవత్సరం నడపబడుతుంది.
సంతోషకరమైన విషయం ఏమిటంటే, చాలా మంది స్నేహితులు హాల్ఫ్ మారథాన్ (13.2 miles) లో పాల్గొంటున్నారు.
సుమారు 14000 మంది పాల్గొంటున్నారు

సుమారు 5 గంటలలో పూర్తి చెయ్యగలమని అనుకుంటున్నాము.
వారం చివరలో మారథాని పరిగెట్టేవాళ్ళంతా carbohydrate food చాలా తింటారు.
ఇదే సందుగా గురువారం నుంచే చికిన్ బిర్యాని మేదకు దాడికి సమాయుత్తమవుతున్నాను. తినడానికి ఇదొక గొప్ప వంక.

http://www.illinoismarathon.com/

Wednesday, March 31, 2010

దూరం దగ్గర మనం అనుకునేది మనకు అనిపించేది

దూరం దగ్గర మనం అనుకునేది మనకు అనిపించేది
ఒక క్షణం దూరం అనిపించే బందం
ఇంకోక్షణం దగ్గర అనిపించే అనుబంధం హృదయం చేసే గారడీ
తోడి చూస్తే హృదయపు లోతుల్లో ఉండే బంధం
దూరం పెరిగినా తీరం చేరినా మారని బంధం
తరచి తరచి ప్రశ్నించినా మారని బంధం
ఆడంబరాలు లేని బంధం
విచిత్రమైన బంధం

Friday, February 26, 2010

నా బతుకే ఒక పరుగైపోయింది. నా నాలుగునెలల పరుగు పట్టిక

వీడికి పరుగు, వ్యాపారం తప్పితే ఇంక వేరే ఏమీ లేవు అనుకోకండి. నా బతుకే ఒక పరుగైపోయింది.

ఇండియా లో ఉన్నప్పుడు కొంచం వర్షం తో వాతావరణం చలిగా ఉందంటే బిర్యాని లాగించి వెచ్చటి రగ్గు కప్పుకుని మునగదీసుకుని పడుకున్న రొజులు ఎన్నో.అలాంటి నాలాంటి అరివీర భయంకర బద్దక చక్రవర్తి, తనంతట తానుగా మూడు నాలుగు గంటలు అలా పరిగెట్టేస్తుంటే, నా స్నేహితులకు చాలా అనుమానాలు వచ్చాయి. ఒకడడిగాడు, ఏరా దారిలో నిద్ర పోతావా అని. ఇంకోడు అన్నాడు, నీకేమైన పిచ్చా , కోరి కోరి ఎవడైనా నాలుగు గంటలు పరిగెడతాడు రా. ఏమి చేస్తాం అని ఊరుకుంటున్నా.
ఇప్పుడు పద్ధతి మార్చా, పరిగెత్తుకొచ్చి బిర్యాని తిని, రిలాక్స్ అయిపోతున్నా.

ఒక ఎనిమిది మంది స్నేహితులకు అంటించా. వాళ్ళూ నడుస్తూ పరిగెట్టటానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళను తలుచుకుంటే జాలి వేస్తుంది. వాళ్ళు పరుగులో (ఊబిలాగా) కూరుకుపోతున్నారని తెలియదు. వాళ్ళు బ్లాగులు చదవరు. చదివిన మీరెవ్వరూ వాళ్ళకు తెలియదు. నాకో పెద్ద ఫాలోయింగ్. వాళ్ళకు పెద్ద ఫోజ్ గా సలహాలు ఇస్తూ ఉంటా.

ఇంకా నెల రోజులే ఉంది. ప్రాక్టీస్ సరిగ్గా లేదు ఇప్పటి వరకు.

ప్రతి వారం పరుగు ప్రణాళిక ఇలా ఉంటుంది

సోమ వారం - 4 మైళ్ళు
మంగళ వారం - స్ట్రెంగ్త్ ఎక్సర్సైజ్
బుధ వారం - 6 మైళ్ళు
గురు వారం - 5 మైళ్ళు
శుక్ర వారం - 6 మైళ్ళు
శని వారం - 10 మైళ్ళు (మారథాన్ దగ్గర పడుతున్న కొద్దీ ఓ రెండు శని వారాలు 20 మైళ్ళు పరిగెత్తాలి )
ఆది వారం - విశ్రాంతి (తెగ పరిగెట్టేసామని)

Thursday, February 25, 2010

వ్యాపార సమారంభకుడు కావాలంటే ముందు ఈ ప్రశ్నలకు సమాధానాలు వ్రాసుకోండి

వ్యాపార సమారంభకుడా, వాడెవరూ అని అడక్కండి. ఆంగ్లపు పదం entrepreneur కి తెలుగు పదం ఇంతకంటే మంచిది తోచలేదు.

వ్యాపారాలు ఏవన్నా కావచ్చు, కిల్లీ బడ్డీ కొట్టు, బొటీక్, ఫాబ్ సిటిలో సెం ఇండియా, ఏవి పెట్టాలన్నా ఈ ప్రశ్నలకు సమాధానాలు వ్రాసుకొనే మొదలు పెట్టాలి. ఈ రోజు కాకపోయినా, ఎప్పుడైనా మీకు స్వంతంగా ఏమన్నా చెయ్యాలన్నప్పుడు ఈ విశ్లేషణ పనికొస్తుంది. ఒకరి కింద పని చేసీ చేసీ చిరాకు వచ్చి, I want to be my boss and I want to control what I want to do అన్నప్పుడు కూడా

As like in any field, there is theory and there is practice. These questions need to be addressed before any entrepreneur embark on this unique journey with the hope of success. Most of the ventures like fall far short of good answers to lot of questions. Some of us don’t do this because of lack of visibility into the future and also our inability to think in whole than parts. Probably successful entrepreneurs would do this exercise. Musings from an also ran

Given all the bias against these kind of list, it is a must do exercise for anybody who want to enjoy the ride into future where we are the masters of our destiny.

Now the serious stuff :-

1) WHAT IS YOUR VISION?
- What is your big vision?
- What problem are you solving and for whom?
- Where do you want to be in the future?

2) WHAT IS YOUR MARKET OPPORTUNITY AND HOW BIG IS IT?
- How big is the market opportunity you are pursuing and how fast is it growing?
- How established (or nascent) is the market?
- Do you have a credible claim on being one of the top two or three players in the market?

3) DESCRIBE YOUR PRODUCT/SERVICE
- What is your product/service?
- How does it solve your customer’s problem?
- What is unique about your product/service?

4) WHO IS YOUR CUSTOMER?
- Who are your existing customers?
- Who is your target customer?
- What defines an "ideal" customer prospect?
- Who actually writes you the check?
- Use specific customer examples where possible.

5) WHAT IS YOUR VALUE PROPOSITION?
- What is your value proposition to the customer?
- What kind of ROI can your customer expect by using buying your product/service?
- What pain are you eliminating?
- Are you selling vitamins, aspirin or antibiotics? (I.e. a luxury, a nice-to-have, or a need-to-have)

6) HOW ARE YOU SELLING?
- What does the sales process look like and how long is the sales cycle?
- How will you reach the target customer? What does it cost to "acquire" a customer?
- What is your sales, marketing and distribution strategy?
- What is the current sales pipeline?

7) HOW DO YOU ACQUIRE CUSTOMERS?
- What is your cost to acquire a customer?
- How will this acquisition cost change over time and why?
- What is the lifetime value of a customer?

8) WHO IS YOUR MANAGEMENT TEAM?
- Who is the management team?
- What is their experience?
- What pieces are missing and what is the plan for filling them?

9) WHAT IS YOUR REVENUE MODEL?
- How do you make money?
- What is your revenue model?
- What is required to become profitable?

10) WHAT STAGE OF DEVELOPMENT ARE YOU AT?
- What is your stage of development? Technology/product? Team? Financial metrics/revenue?
- What has been the progress to date (make reality and future clear)?
- What are your future milestones?

11) WHAT ARE YOUR PLANS FOR FUND RAISING?
- What funds have already been raised?
- How much money are you raising and at what valuation?
- How will the money be spent?
- How long will it last and where will the company "be" on its milestones progress at that time?
- How much additional funding do you anticipate raising & when?

12) WHO IS YOUR COMPETITION?
- Who is your existing & likely competition?
- Who is adjacent to you (in the market) that could enter your market (and compete) or could be a co-opted partner?
- What are their strengths/weaknesses?
- Why are you different?

13) WHAT PARTNERSHIPS DO YOU HAVE?
- Who are your key distribution and technology partners (current & future)?
- How dependent are you on these partners?

14) HOW DO YOU FIT WITH THE PROSPECTIVE INVESTOR?
- How does this fit w/ the investor’s portfolio and expertise?
- What synergies, competition exist with the investor’s existing portfolio?

15) OTHER
- What assumptions are key to the success of the business?
- What "gotchas" could change the business overnight? New technologies, new market entrants, change in standards or regulations?
- What are your company’s weak links?


(గమనిక :--బిజినెస్ వెంచెర్ పేరు చెప్పి ప్రభుత్వం దగ్గర స్తలం కొట్టేయాలంటే ఇదంతా అక్కర్లేదు )


Sunday, February 21, 2010

ఈ మధ్య మీరు ఎక్సర్ సైజ్ చేసింది ఎప్పుడు?

ఈ మధ్య కొంత మంది స్నేహితులు, తెలిసిన వారు తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. 30 ఏళ్ళ వాడికే గుండె పోటు. ఇంకొకడికి ఇంకొకటి. విన్న అన్ని సందర్బాలలోనూ, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చెయ్యటం.వేళకి తిండి తినకపోవటం దగ్గరనుంచి, కనీస వ్యాయామం లేకపోవటం, ఇలాంటి ఎన్నో కారణాలు.

ఏమన్నా చెయ్యమని చెప్తే, సమయం లేదనే సాకు మాత్రం చాలా ఎక్కువ గా వింటున్నాను.ఒక వేళ పొరపాటున సమయం ఉందనుకోండి, ఎలా చెయ్యాలి, ఏమి చెయ్యాలి, వసతులు లేవనే సాకులు.

మనసుంటే మార్గం ఉంటుందని, మనం ఉన్న చోటునే చెయ్యగలిగేవి ఎన్నో ఉన్నాయి. ఆఫీస్ లో కూర్చునే చేసే పద్దతులు ఎన్నో ఉన్నాయు. వళ్ళు బద్దకం, సాకులు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకుంటే ఏమి లాభం అని. కొంచం వయసు మేద పడుతున్న కొద్దీ , బయట పడతాయి వ్యాధి ఖజానా.

చదువుతున్న మీరేమీ కంగారు పడొద్దు, మిమ్మల్ని అంటున్నట్టుందా.
అవునూ, మీరు ఈ మధ్య కాలంలో వ్యాయమం అనే ఒక పని పొరపాటున చేసారా?
చెయ్యలేదా, ఐతే ఒక నెల రోజులు చెయ్యండి మీకు వీలైనది. మీకే తెలుస్తుంది.

lay out a plan and follow it scrupulously...
think about your dear ones .....

Friday, February 12, 2010

చైనా లో వేగమైన బులెట్ ట్రైన్ 1078 కిమీలు 3 గంటలలో ప్రయాణిస్తుంది

ఈ కొత్త బులెట్ ట్రైన్ దక్షిణాన ఉన్న గుంగ్జావ్ నుంచి ఉనాన్ కి వెల్తుంది. చైనా ఇంకా ఇలాంటివి 42 రైల్ లైన్స్ నిర్మిస్తుంది. అవన్నీ 2012 కళ్ళా పూర్తి అవుతాయి. అక్షరాలా 422400,00,00,000 రూపాయలు ఖర్చుపెడుతుంది.

ఈ రైల్ లైన్లు కట్టటానికి లక్షల మంది కార్మికులను వాడుతుంది. బీజింగ్ నుంచి షాంఘ్ హై 1320 కిమీ దూరం పట్టాలు వేయటానికి 110000 మంది కార్మికులు పని చేస్తున్నారు.

ఇదొక మచ్చు తునక చైనా అభివృద్దికి.

మనమూ ఉన్నాము. మనలో మనకు కొట్టుకోవటానికి, తిట్టుకోవటానికే టైం సరిపోవట్లేదు.ఇంక అభివృద్ది, ప్రగతి లాంటి చండాలపు పనులు మనకక్కర్లేదు

(కొస మెరుపు: ఒరే గ్లాస్ మార్చండ్రోయ్, ఈయనెవడో చట్నీ అనుకుని మంచినీళ్ళలో ముంచుకు తినేస్తున్నాడు)

Thursday, February 11, 2010

మారథాన్ సమయం ఆసన్నమైంది Champaign, Illinois

మా పల్లెటూర్లో ఈ సంవత్సరం కూడా మారథాన్ నిర్వహిస్తున్నారు. కిందటి సంవత్సరం 5:30 గంటల సమయం తీసుకున్నాను (పరుగుకి వారం రోజుల ముందు జ్వరం వచ్చి). ఈ సారి అంతకంటే తక్కువ సమయం లో పరిగెడదామనుకుంటున్నాను . నేను ఒక్కడినే ఎందుకీ నరకయాతన పడాలని, పనిలో పనిగా మా ఆవిడని కూడా దింపేసా. తను కూడా పరిగెడుతుంది 26.2 మైళ్ళు
అంతటితో ఆగకుండా, స్నేహితులను కూడా సైన్ అప్ చేయిస్తున్నా. నేను కనపడితే చాలు పారిపోతున్నారు.ఇప్పటిదాకా 6గురు హాఫ్ మారథాన్ , ముగ్గురు 3మైళ్ళు పరిగెట్టడానికి సైన్ అప్ చేసారు.

మీరు కూడా పరిగెడతానంటే , ఇక్కడ రిజిష్టర్ అవ్వండి. http://www.illinoismarathon.com/

Thursday, October 1, 2009

హార్వర్డ్ బిజినెస్ స్కూల్ వారి న్యూస్ లెటర్ లింక్

బిజినెస్ మరియు ఎకనమిక్స్ పై ఆసక్తి ఉన్న వాళ్ళకి ఈ లింక్స్ ఉపయోగపడతాయి అని ఆశిస్తున్నాను. ఇంటర్నెట్లో కావల్సినంత విజ్ఞానం ఉంది. ఎక్కడ ఏమి ఉంది , వాటిని మనం ఎలా ఉపయోగించుకోవాలి అన్నది మన ఇంటరెస్ట్ పైన ఉంటుంది. నా మటుకు నేను చాలా విషయాలు నేర్చుకున్నాను ఈ సైట్స్ నుంచి.
అమెరికా లోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల మరియు కొన్ని టాప్ కన్సల్టింగ్ కంపెనీల క్నాలెడ్జ్, న్యూస్ లెటర్ సైట్స్ ఇవి.న్యూస్ లెటర్స్ కి సైన్ అప్ చేస్తే , కొత్త ఆర్టికల్స్ వచ్చినప్పుడు మెయిల్ పంపిస్త్తారు

http://knowledge.wharton.upenn.edu/india -- వార్టన్ బిజినెస్ స్కూల్ అమెరికా లో నంబర్ ఒన్ బిజినెస్ లో , ఇచ్చిన లింక్ లో భారత దేశానికి సంబందించిన విషయాల పై ఉంటుంది , మెయిన్ సైట్ http://knowledge.wharton.upenn.edu

http://hbswk.hbs.edu/index.html -- హార్వర్డ్ కూడా MBA టాప్ స్కూల్ (వీడేంది MBA అంటాడు స్కూల్ అంటాడు అనుకుంటున్నారా)
http://www.mckinseyquarterly.com/home.aspx - one of the top business consultant firms in the వరల్డ్, I learned a lot about china's development and stratagies from this site. In the latest edition, I read the interview with the CFO of Tata Steel Koushik Chatterjee

http://www.gsb.stanford.edu/news/knowledgebase.html -- stanford is another top school, google founders phd project was from this university

http://www.strategy-business.com -- a very good site on strategy and బిజినెస్

http://www.technologyreview.com/index.aspx -- magazine from MIT

మీకు తెలిసిన మంచి బిజినెస్, ఎకనమిక్స్ వెబ్ సైట్స్ ఇక్కడ తెలుపగలరు

Wednesday, September 30, 2009

చైనా వాళ్ళేమనుకుంటారు మనలను చూసి (మనకు అవసరం అంటారా)

చాలా రోజుల తరువాత వ్రాస్తూ, యువరాజ్ సింగ్ వీరబాదుడ్లోని ఒక సిక్సర్ లాంటి టాపిక్ తీసుకున్నాను (అలా అని చెప్పి నన్ను ఉతికి ఆరెయ్యకండే)

ఈ మధ్య కాలంలోకొంత మంది చైనీయ స్నేహితులతో మాట్లాడుతూ, ఒకానొక సందర్బంలో భారత్ - చైనాల తేడాలమీదకు సంభాషణ మళ్ళింది. వాళ్ళ మాటల బట్టి తెలిసిందేమిటంటే
భారతదేశాన్ని వాళ్ళసలు ఏ మాత్రం లెక్క చెయ్యరని.
వాళ్ళంత అభివృద్ది చెందినా మన ఐటి రంగాన్ని చూసి వాళ్ళకి అసూయ అని

ఇంకా చాల గొప్పలు చెప్పుకున్నారు లెండి (నేను మనసులో అనుకున్నా , మా దేశానికి కూడా టైం వస్తది, మేము గెలుస్తాం ఒలంపిక్ మెడల్స్ మీ లాగా, మేము అభివృద్ది చెందుతాం , పేద ప్రజల కనీస అవసరాలు తీర్చగలుగుతామని ---- మరీ ఎక్కువ అనేసుకున్నానంటారా ..... సారీ , ఆ టైంలో ఆవేశంలో అలా అనేసుకున్నా, లెంపలు వేసుకుంటున్నాను లెండి )
చైనీయులు చాలా తెలివి అయిన వాళ్ళు, సిద్ధాంతాల జోలికి పోకుండా, దేశ అబివృద్ది కోసం, కావల్సిన మార్పులు చేర్పులు చేసుకుని ఈ స్తితికి వచ్చారు. పాతికేళ్ళ క్రితం, భారత్ చైనా తలసరి ఆదాయం సమానం గా ఉండేది, ఈ రోజు మనకి రెట్టింపు.
ఏ ఇజం అయితే ఏముందండి, ప్రతి పౌరుడికి కనీస అవసరాలు తీర్చలేనిది ఏది అయినా వ్యర్దం

మీకు ఎవరకీ నా వాగుడు ఒక్క ముక్క అర్దమైనట్లు లేదు, ఇంక ఊరుకునేది లేదు, తరువాయి కమ్యూనిజమా కాపటలిజమా , మద్యలో ఇంకో ఇజమా
మరింకొన్ని చైనా సంగతులు కూడా

Friday, April 17, 2009

26.2 మైళ్ళ పరుగు ప్రయత్నంలో నేర్చుకున్నవి

ఈ మారథాన్ పరుగు ప్రయత్నంలో నేను నేర్చుకున్న విషయాలు ఇవి. నిజానికి తరతరాలనుంచి పెద్దవాళ్ళు చెప్పినవే. కొన్ని నా ప్రయాణంలో గోచరించినవి, మరి కొన్ని మునుపు విన్నవీ తిరిగి గుర్తుకొచ్చినవీను. ఇలా మీ అందరితో మరోసారి పంచుకోవాలని ఈ టపా వ్రాస్తున్నాను.

  1. ఏ పనైనా మొదలుపెట్టకముందు అసాధ్యంగానే ఉంటుంది. అలాగే నాకు 26మైళ్ళు అనగానే గుండెల్లో రాయి పడింది. ఏకధాటిన నాలుగు గంటల పరుగు అనేసరికి నా సామర్ధ్యం మీద నాకే అపనమ్మకం, అసలు సాధనలోకి వెళ్ళాలా వద్దా అని సంకోచం కలిగాయి. సంకల్పసిద్దే నా బలం అనుకుని మొదలిడాను. అంతిమ లక్ష్యం గురించి ఆలోచించకుండా, నెలల తరబడి కొంచం కొంచంగా పరుగు దూరం పెంచుకుంటూ పోయి ఆఖరుకు పరిగెత్తేసా. దేనికైనా ప్రారంభం కావాలి. అది అనుకున్న రోజే కావాలి. కాలక్రమేణా మన లక్ష్యానికి చేరువ అవుతాం.
  2. ఆసరా ఉంటే ఏదన్నా సాధించవచ్చు. నాకు ఒక మంచి మనిషి ప్రోత్సాహం దొరికేసరికి, లక్ష్యం ఎంత కష్టం అని ఆలోచించకుండానే ముందుకి దూకాను. మనలను ప్రొత్సాహించే మంచి వాళ్ళు దొరకటం మన అదృష్టం. అలాంటి వాళ్ళ కోసం మన జీవన ప్రయాణంలో వెతుకుతూ ఉండాలి. మనకి అందిన ప్రోత్సాహం మనం కూడా ఇతరులకు ఇవ్వాలని నేర్చుకున్నాను.
  3. లక్ష్యం నిర్దేశితమైన తరువాత, ఎండ, వాన, చలి అనేది లేకుండా ప్రయత్నిస్తాం (నాది పరుగు కాబట్టి వాతావరణం పాత్ర ఉంది). చలి అంటే ఇంట్లో మునగ తీసుకుని, వెచ్చగా రగ్గు కప్పుకుని బిర్యాని (కొంత మందికి మిరపకాయ బజ్జీలు) తినే బాపతు అయిన నేనే, ఎముకలు కొరికే చలిలో పరిగెడతానని కలలో కూడా అనుకోలేదు. ఒకప్పుడు అలా పరిగెత్తే వాళ్ళను చూసి, అసలు ఎలా పరుగెడతారో అనుకునే వాడిని. కానీ నా లక్ష్యమే నన్ను చివరి వరకు నడిపించింది.
  4. లక్ష్య సాధన వయసుకి సంబందించిన కాదు, మనసుకి ముడిపడినది. దానికి స్త్రీ పురుషుల తేడా తెలియదు. నేను ఈతకొలను లో ఈత నేర్చుకోవటానికి వెళ్ళినప్పుడు నా ప్రక్కనే ఒక 90 ఏళ్ళ స్త్రీ కూడా వయసుతో నిమిత్తం లేకుండా ఎంతో ఉత్సాహంగా నేర్చుకోవటానికి వచ్చింది. ఆమెతో పరిచయమైతే చెప్పింది, 80 ఏళ్ల స్నేహితురాలు నేర్చుకుందంట ఈ మధ్య , అందుకని ఈమె మొదలుపెట్టింది. ఆ రోజే అనుకున్నా, జీవితాంతం వరకు క్రొత్తవి నేర్చుకుంటూ, ప్రయత్నిస్తూ గడపాలని.
  5. లక్ష్య సాధనలో, హేమాహేమీలు ఎదురౌతారు, మనం చెయ్యాలనుకున్నది అవలీలగా చేస్తుంటారు. మన గోల మనది. సాధన చేస్తున్నప్పుడు, నా స్నేహితుడు చెప్పిన విషయం, "మారథాన్ పరుగెడుతున్నప్పుడు, 70 ఏళ్ళ వ్యక్తి కూడా కుర్రవాడి మాదిరిగా సునాయాసంగా నిన్ను దాటి వెళ్ళిపోతుంటాడు. అది చూసి ఏమీ కలత చెందవద్దు. నీ ప్రయత్నం నీది. వాళ్లెంత సాధనతో ఈ స్థానానికి చేరుకున్నారో, ఎన్ని కష్టాలు పడ్డారో నీకు తెలియదు. నువ్వేదో పోటుగాడిలా ఈ మధ్య మొదలుపెట్టి, రెచ్చిపోయి చతికిలపడకు." అని. అటువంటివారు నిజంగానే తారసపడ్డారు. వారు నాలో ఆ స్థాయికి చేరాలన్న స్ఫూర్తిని పెంచారే కానీ వారిని అధిగమించగలనా అని నిస్పృహని మాత్రం కలిగించలేదు.
  6. మనిషి తలచుకుంటే ఏమన్నా చేయగలడు. నా మటుకు నేను పూర్తిగా తలచుకోలేదు. అయినా చేసిన సాధన సరిపోయి, దేవుని దయ వల్ల పూర్తి చేసేసాను. కాబట్టి మనము పూర్తి ప్రయత్నం చెయ్యకుండా, దేవుని పై భారం వదిలెయ్యాలి. (అయ్యో ఇది ఆచరించారంటే గొడవలైపోతాయి)

ఇవన్నీ నేనేమీ కొత్తగా కనిపెట్టిన విషయాలేమి కాదు, నేను నేర్చుకున్న విషయాలు. ఇంకొన్ని విశేషాలతో తరువాయి టపాలో కలుద్దాం.