ఈ మధ్య కొంత మంది స్నేహితులు, తెలిసిన వారు తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. 30 ఏళ్ళ వాడికే గుండె పోటు. ఇంకొకడికి ఇంకొకటి. విన్న అన్ని సందర్బాలలోనూ, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చెయ్యటం.వేళకి తిండి తినకపోవటం దగ్గరనుంచి, కనీస వ్యాయామం లేకపోవటం, ఇలాంటి ఎన్నో కారణాలు.
ఏమన్నా చెయ్యమని చెప్తే, సమయం లేదనే సాకు మాత్రం చాలా ఎక్కువ గా వింటున్నాను.ఒక వేళ పొరపాటున సమయం ఉందనుకోండి, ఎలా చెయ్యాలి, ఏమి చెయ్యాలి, వసతులు లేవనే సాకులు.
మనసుంటే మార్గం ఉంటుందని, మనం ఉన్న చోటునే చెయ్యగలిగేవి ఎన్నో ఉన్నాయి. ఆఫీస్ లో కూర్చునే చేసే పద్దతులు ఎన్నో ఉన్నాయు. వళ్ళు బద్దకం, సాకులు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకుంటే ఏమి లాభం అని. కొంచం వయసు మేద పడుతున్న కొద్దీ , బయట పడతాయి వ్యాధి ఖజానా.
చదువుతున్న మీరేమీ కంగారు పడొద్దు, మిమ్మల్ని అంటున్నట్టుందా.
అవునూ, మీరు ఈ మధ్య కాలంలో వ్యాయమం అనే ఒక పని పొరపాటున చేసారా?
చెయ్యలేదా, ఐతే ఒక నెల రోజులు చెయ్యండి మీకు వీలైనది. మీకే తెలుస్తుంది.
lay out a plan and follow it scrupulously...
think about your dear ones .....
Sunday, February 21, 2010
Subscribe to:
Post Comments (Atom)
9 comments:
నేను రోజు 30 నిముషాల లో 5.5 KM పరిగిస్తాను. దాదాపు 360 కాలరిస్ కాల్చుతాను. Speed 10-12KM/hour
చాలా చక్కగా చెప్పారు.....అరచి చెప్పాలని వుందండీ ....యెందుకంటే జనం ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు ...మూల్యం చెల్లిస్తున్నారు కూడా ...పైసా ఖర్చు లేని పని వ్యాయామం కానీ యన్తో వుపయోగం ...
మంచి టపా ! కాని పాటించడమే కష్టం .....
@ శ్రీకర్ గారు !!!!!
శ్రీకర్, చాలా సంతోషం. ఆ పరుగుని అలాగే కొనసాగించండి. ఆ అలవాటుని స్నేహితులికి అంటించండి
kvsv gaaru, కనీసపు శ్రద్ధ చూపిస్తే ఆరోగ్యం చాలా బాగుపడుతుంది కదా
పరిమళంగారు, పాటించటం అంత కష్టం అంటారా. రోజుకి పది నిమిషాలు చాలండి.మనం చేసేదంతా ఇప్పటికంటే , లాంగ్ టర్మ్ లో ఉపయోగం కనబడుతుంది.
బాటసారి గారు మీరన్నట్టు ఆ అలవాటుని స్నేహితులకి అంటించాలండీ ...ప్రతీ వొక్కరు కూడా
అయ్యో నా చేతులు కూడా కాలాయండి, ఆకులు వెతుక్కోవాలి!!! సంవత్సరం పైనే అవుంతుంది జిమ్మ్ కి వెళ్ళి. కాకపొతే బద్దకం మాత్రమె కాదు, మెడ కూడా బెణికింది.
Post a Comment