మా పల్లెటూర్లో ఈ సంవత్సరం కూడా మారథాన్ నిర్వహిస్తున్నారు. కిందటి సంవత్సరం 5:30 గంటల సమయం తీసుకున్నాను (పరుగుకి వారం రోజుల ముందు జ్వరం వచ్చి). ఈ సారి అంతకంటే తక్కువ సమయం లో పరిగెడదామనుకుంటున్నాను . నేను ఒక్కడినే ఎందుకీ నరకయాతన పడాలని, పనిలో పనిగా మా ఆవిడని కూడా దింపేసా. తను కూడా పరిగెడుతుంది 26.2 మైళ్ళు
అంతటితో ఆగకుండా, స్నేహితులను కూడా సైన్ అప్ చేయిస్తున్నా. నేను కనపడితే చాలు పారిపోతున్నారు.ఇప్పటిదాకా 6గురు హాఫ్ మారథాన్ , ముగ్గురు 3మైళ్ళు పరిగెట్టడానికి సైన్ అప్ చేసారు.
మీరు కూడా పరిగెడతానంటే , ఇక్కడ రిజిష్టర్ అవ్వండి. http://www.illinoismarathon.com/
Thursday, February 11, 2010
Subscribe to:
Post Comments (Atom)
8 comments:
మీరు డాలస్ వాసులైతే బాగుండేదండి. పా్రమిస్ నేను, మిమ్మల్ని తప్పించుకు తిరిగేవాడిని గాదు. నాలుగైదు సంవత్సరాల క్రిందట ముక్కీ మూలిగి ఒకటి పరిగెతా్త. రెండోదానికి మోటివేషన్ కొంచెము కష్టముగానే ఉంది. మీరు చేయగలుగుతున్నందుకు అభినందనలు.
>>నేను ఒక్కడినే ఎందుకీ నరకయాతన పడాలని, పనిలో పనిగా మా ఆవిడని కూడా దింపేసా. తను కూడా పరిగెడుతుంది 26.2 మైళ్ళు
:):)
అత్భుతం..
సురేష్ గారు, ధన్యవాదాలు. మొదటి మారథానే కష్టం సార్, ఒకటి పరిగెత్తేసారు కదా.రెండోది మొదటి దాని కంటే బాగా చెయ్యాలని మొదలుపెట్టండి.
డాలస్ నయం , మేము ఎముకలు కొరికే చలిలో, మంచులో, ఐస్ లో పరిగెట్టాలి.
ఇంకోటి పరిగెత్తయ్యండి ఈ సంవత్సరం.
బాగుందండీ గుడ్ లక్...
మీకు, మీ శ్రీమతికి మీరనుకున్న సమయానికి పరుగు పూర్తిచేయటానికి తగిన సాధనకి, ఆరోగ్యానికి, ఆ చివరిరోజు విజయానికి - ఆల్ ద బెస్ట్.
వేణూ శ్రీకాంత్, భాస్కర్ రామ రాజు, అనామిక
ధన్యవాదాలు
> నేను ఒక్కడినే ఎందుకీ నరకయాతన పడాలని, పనిలో పనిగా మా ఆవిడని కూడా దింపేసా
:-)
పానీపూరీ, ఊరికే హాస్యానికి, నరకయాతన అని వాడాను. We are really enjoying this journey that will culminate on May1st
Post a Comment