Friday, February 12, 2010

చైనా లో వేగమైన బులెట్ ట్రైన్ 1078 కిమీలు 3 గంటలలో ప్రయాణిస్తుంది

ఈ కొత్త బులెట్ ట్రైన్ దక్షిణాన ఉన్న గుంగ్జావ్ నుంచి ఉనాన్ కి వెల్తుంది. చైనా ఇంకా ఇలాంటివి 42 రైల్ లైన్స్ నిర్మిస్తుంది. అవన్నీ 2012 కళ్ళా పూర్తి అవుతాయి. అక్షరాలా 422400,00,00,000 రూపాయలు ఖర్చుపెడుతుంది.

ఈ రైల్ లైన్లు కట్టటానికి లక్షల మంది కార్మికులను వాడుతుంది. బీజింగ్ నుంచి షాంఘ్ హై 1320 కిమీ దూరం పట్టాలు వేయటానికి 110000 మంది కార్మికులు పని చేస్తున్నారు.

ఇదొక మచ్చు తునక చైనా అభివృద్దికి.

మనమూ ఉన్నాము. మనలో మనకు కొట్టుకోవటానికి, తిట్టుకోవటానికే టైం సరిపోవట్లేదు.ఇంక అభివృద్ది, ప్రగతి లాంటి చండాలపు పనులు మనకక్కర్లేదు

(కొస మెరుపు: ఒరే గ్లాస్ మార్చండ్రోయ్, ఈయనెవడో చట్నీ అనుకుని మంచినీళ్ళలో ముంచుకు తినేస్తున్నాడు)

3 comments:

kvsv said...

కరెక్ట్ గా చెప్పారు మనకు కొట్టుకు చావడానికే సమయం సరిపోదు మన తెలివితేటల్ని ఆ దారిలోనే కర్చుపెడతామ్ ...మన నాయకులు వాళ్లను నమ్మి మూర్కపు వాదనలు చేసే మన ప్రజల్లో ఒక్కరయిన ఇది చూసి మారతారని ఆశిద్దాం

నీహారిక said...

నాకైతే మనకన్నా ఎంతో పెద్దది,జనాభా కూడా ఎంతో ఎక్కువున్న చైనా అలా అభివృద్ధి చెందుతుంటే అసూయగా ఉంటుంది.మన్మోహన్ గుర్తించారు,ఆయనొక్కరే ఏం చేస్తారు.అందరూ గుర్తించాలి కదా?

Change Maker said...

చైనా అభివృద్దిని, ప్రగతి గురించి మనం పట్టించుకోపోతే, చాప క్రింద నీరులా వచ్చి మనల్ని కబళిస్తుంది. ఇండోనేషియా, వియత్నాం లలొ చాలా పరిశ్రమలు మూత పడుతున్నాయి. మనకీ వుంది సినిమా ముందు ముందు.