పడిన తెల్లని మంచు గడచిన కాలంతో కరిగీ కరగని స్థితిలో
చిద్రమైన మనసులా చెల్లాచెదరై దాగిఉంచిన నిజస్వరూపంలో
చవిచూడని వేరీ కోణాన్ని ప్రస్పుటించే జ్వాలలో
అల్లకల్లోలమైన తెల్లని రంగు కొత్త పోకడలతో తెచ్చిపెట్టుకున్న వర్ణాలతో
ఘనీభవించిన మంచు , మారిన రంగు ఇష్టపడ్డ మనసునే విరిచేసి
సంతోషం వెన్నంటే దుఃఖం అనే జీవిత సత్యాన్ని తెలపకనే తెలిపాయి
Wednesday, December 17, 2008
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
ఇంకా కరుగుతున్న కల అన్నన్నారు కదా బాటసారిగారు? మీకు అలుపు లేకుంటే దాన్ని మీరే అదుపుచేయొచ్చు, అయినా "బహుదారపు" విశెషనం మీ పేరులోనేవుంది కనుక బహుశ మీకు సమయమింకా మించిపోలేదు. ఈ పయనాలన్నీ ఒంటరివికావులేండి. మంచు కురిసే వేళలో మల్లి కూడా విరుస్తుంది. మీ భావుకత్లో పూదండలో దారంవలే వ్యధ దాగుంది. ఈ కూడలి మీకు కావల్సినంత స్వాంతనిస్తుందని అకాంక్షిస్తూ, పునః స్వాగతం.
ఉష గారు, చాలా ధన్యవాదాలు. మనసునే అదుపు చెయ్యలేకపోతే, ఇంక కలనేమి అదుపు చెయ్యమంటారు. వ్యధ జీవితంలో అంతర్లీనం కదండి.
మంచులా ప్రకాశిస్తూ ఉంది మీ కవిత.
జ్వాల అన్న ఆక్సిమోరాన్ వద్ద గుండె ఝల్లుమంది.
చిక్కని ఊహలు.
(చేతికి చిక్కని అన్న అర్ధం కాదు సుమండీ, సాంద్రతతో కూడిన అని)
బాబా గారు, మీ ప్రశంసలకు చాలా ధన్యవాదాలు
Post a Comment