పనిలేని మంగలి పిల్ల తల గొరిగినట్టు, ఏదైనా వ్రాద్దామని సంకల్పించా
కలం ముందుకు కదలందే, ఈ కవులు భావుకలందిరికీ కవితాప్రవాహం ఎలా పొర్లిపొంగుతుందో అనే ఆలోచనని నొక్కిపట్టి, కవితా వస్తువుకోసం వెతికా, అక్కడే మొదటి తప్పు చేస్తున్నానంటారా, ఇదేమైనా బజార్లో దొరికే వస్తువా అని.
మంచు విపరీతంగా కురుస్తోంది, కనుచూపుమేరా శ్వేతపత్రంలా విస్తరించి
చంద్రుని కిరణాలలో ధగధగ మెరుస్తున్న మంచు కణాల మెరుపులు
చల్లటి పిల్లగాలి విసిరేస్తున్న మంచు ధూళి కప్పబడిన మోడు చెట్లు
ప్రకృతి అద్బుతాలు కోకొల్లలు
2 comments:
బాగా రాశారండి. ముందు హ్యూమర్, ఆ తరువాత కవిత.
ఏదో చిరు ప్రయత్నం, మీకు నచ్చినందుకు చాలా సంతోషం. భావుకత లేకుండా, ఇలా అడ్డదిడ్డంగా వ్రాయచ్చా అన్న సందేహాన్ని , ప్రశంసతో తుడిచేసారు. చాలా ధన్యవాదాలండి.
Post a Comment