గత మూడు సంవత్సారాలుగా పరిగెట్టడం ప్రారంభించాను. వేసవకాలంలో పరుగు పర్వాలేదు కానీ శీతాకాలంలో బయట పరుగెట్టటం ఒక సాహసం. పరుగు యంత్రం (ట్రెడ్ మిల్) మీద గంటలు గంటలు పరిగెత్తడం విసుగు.
ఇంతక ముందు పరుగులన్నీ ఒక ఎత్తైతే, మొన్న వారాంతం (వీకెండ్) పరిగెట్టిన రెండు గంటలు ఒక మేలితావు. భయంకరమైన చలిలో పరుగు
సమయం -- ఉదయం 8 గంటలకు
ఉష్ణోగ్రత -- 5 degrees farenheit (-15 degrees centigrade)
గాలి ఉత్సాహం (wind chill) -- వీసే గాలికి చలి ఇంకా ఎక్కువ అనిపిస్తుంది, ఉష్ణోగ్రత ఇంకా పడిపోతుంది
(ఇలాంటి చలిలో కోటు లేకుండా పదినిమిషాలు బయట నిలబడితే ముక్కు కానీ , చెవి కానీ విరిగిపడుతుందని చెప్తారు,(నేను ప్రయత్నించలేదు కాబట్టి నాకు అనుభవపూర్వకంగా తెలియదు))
చలికి సరి పడిన వస్త్రాలు వేసుకుంటాం కాబట్టి అంత కష్టం అనిపించదు. పరుగు మొదలుపెట్టిన ఐదు నిమిషాలు కొంచం కష్టంగా ఉంటుంది కానీ, తరువాత శరీరం నుంచి పుడుతున్న ఉష్ణం అలవాటు చేస్తుంది. తరువాత పరుగులో పడి చలి మర్చిపోతాం.చలికి తోడు, దారిలో ఉన్న గడ్డకట్టిన మంచుకి దొరికిపోకుండా చూసుకోవాలి. జారితిమిపో, నడ్డి విరుగుట కాయం.
హాయిగా ముసుగుతప్పి పడుకోక, ఇదంతా అవసరం అంటారా? నేనూ పూర్వాశ్రమంలో, చలిగా ఉందని, ముసుగుతన్ని కార్యాలయం (ఆఫీస్) కు ఎగనామం పెట్టిన రోజులు కోకొల్లలు. దేశాలు మారినా, ఖండాలు మారినా, పుట్టకతో వచ్చిన బుద్ది కాబట్టి తూచాతప్పక పాటించేవాడిని.
పరుగు అంతా అయినతరువాత వచ్చే సంతృప్తి వెలలేనిది. మొన్న చేసిన సాహసకార్యం చాలా సంతృప్తినిచ్చింది.
మరి నా కోరి తెచ్చుకున్న కష్టాలు చదివారు కదా , నా గురించి జాలిపడుతూ మీరు ఉంటున్న వెచ్చటి వాతావరణం లో , ఓ నడకకో పరుగుకో వెళ్ళొచ్చు కదా. కాస్త లేవండి మరి.
Tuesday, January 25, 2011
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
"పరుగు అంతా అయినతరువాత వచ్చే సంతృప్తి వెలలేనిది" So True.
Keep Running. There is nothing better than that.
Kumar N
Kumar
I go with BARD.
Mauli
Easy!
Oops posted this on a wrong page. My mobile is running out ofcharge. Laterx
Mr.Bard, Nice to meet you
Ravi M
Post a Comment