చాలా రోజుల తరువాత వ్రాస్తూ, యువరాజ్ సింగ్ వీరబాదుడ్లోని ఒక సిక్సర్ లాంటి టాపిక్ తీసుకున్నాను (అలా అని చెప్పి నన్ను ఉతికి ఆరెయ్యకండే)
ఈ మధ్య కాలంలోకొంత మంది చైనీయ స్నేహితులతో మాట్లాడుతూ, ఒకానొక సందర్బంలో భారత్ - చైనాల తేడాలమీదకు సంభాషణ మళ్ళింది. వాళ్ళ మాటల బట్టి తెలిసిందేమిటంటే
భారతదేశాన్ని వాళ్ళసలు ఏ మాత్రం లెక్క చెయ్యరని.
వాళ్ళంత అభివృద్ది చెందినా మన ఐటి రంగాన్ని చూసి వాళ్ళకి అసూయ అని
ఇంకా చాల గొప్పలు చెప్పుకున్నారు లెండి (నేను మనసులో అనుకున్నా , మా దేశానికి కూడా టైం వస్తది, మేము గెలుస్తాం ఒలంపిక్ మెడల్స్ మీ లాగా, మేము అభివృద్ది చెందుతాం , పేద ప్రజల కనీస అవసరాలు తీర్చగలుగుతామని ---- మరీ ఎక్కువ అనేసుకున్నానంటారా ..... సారీ , ఆ టైంలో ఆవేశంలో అలా అనేసుకున్నా, లెంపలు వేసుకుంటున్నాను లెండి )
చైనీయులు చాలా తెలివి అయిన వాళ్ళు, సిద్ధాంతాల జోలికి పోకుండా, దేశ అబివృద్ది కోసం, కావల్సిన మార్పులు చేర్పులు చేసుకుని ఈ స్తితికి వచ్చారు. పాతికేళ్ళ క్రితం, భారత్ చైనా తలసరి ఆదాయం సమానం గా ఉండేది, ఈ రోజు మనకి రెట్టింపు.
ఏ ఇజం అయితే ఏముందండి, ప్రతి పౌరుడికి కనీస అవసరాలు తీర్చలేనిది ఏది అయినా వ్యర్దం
మీకు ఎవరకీ నా వాగుడు ఒక్క ముక్క అర్దమైనట్లు లేదు, ఇంక ఊరుకునేది లేదు, తరువాయి కమ్యూనిజమా కాపటలిజమా , మద్యలో ఇంకో ఇజమా
మరింకొన్ని చైనా సంగతులు కూడా
Wednesday, September 30, 2009
Subscribe to:
Post Comments (Atom)
10 comments:
మీరు మాట్లాడిన ఇద్దరు చైనీయుల ద్వారా అందరి చైనీయులనూ ఒకే గాటిన కడితే ఎట్లా?? :)
@బృహఃస్పతి
మీ కామెంట్ అర్థం కాలేదు )-:? కొంచం విపులీకరించగాలరా?
పూర్తిస్థాయి కమ్యూనిజం-పూర్తిస్థాయి క్యాపిటలిజం రెండూ సామాన్యుడికి ప్రమాదాలే. అటూఇటూకాని మన (ప్రకాస్వామ్య) సిద్ధాంతమే బెటర్.
గణేష్ మీరన్నారు కదా, చైనా వాళ్ళు మనలను కేర్ చెయ్యరని, మనమంటే అసూయ అని... అది కేవలం మీరు మాట్లాడిన వారి వ్యక్తిగత అభిప్రాయమని చెబుతున్నా. నాకొక చైనా రూమ్మేట్ ఉండేవాడు. ఒక సoవత్సరం పాటు ఒకే ఇల్లు షేర్ చేసుకున్నాం. అతడెప్పుడూ ఇలాంటి భావనలు వ్యక్తం చేయలేదు. అతడికి భారతీయ సంస్కృతి పై మంచి ఆసక్తి. ఇది కూడా అతడి వ్యక్తిగత అభిప్రాయమేలెండి :)
బృహ:స్పతి గారు, నీ హావ్ (అంటే చైనీస్ లో హల్లో అని)
గణేష్ గారు మీ కామెంట్ కి ప్రతి కామెంటారు.
బాటసారి చైనా అంతా తిరిగేసి వెనక్కి వచ్చి ప్రవేశం
మీరన్నట్లు ఒకరిద్దరి తో మాట్లాడి ఒకే గాటిన కట్టడం తప్పే. నేను ఇంతకు ముందు కూడా కొంతమంది తో మాట్లాడినప్పుడు , కొన్ని సంవత్సారాల క్రింద చదివిన చైనీస్ సర్వేలలో చూసాను ఇలా అని. (dont ask me to quote the sources now :))
ఏమండీ, బలవంతులకెప్పుడూ బలహీనులను చూస్తే చులకనే కదా.
ఇక్కడ ఒక విషయం గమనించాలి. మీరు అన్నది సంస్కృతి పరంగా. అది అందరికీ గౌరవమే. ఈ చులకన ఆర్ధికపరంగా, ప్రపంచంలో స్థానం పరంగా, మన సత్తా పరంగా.
ధన్యవాదాలు
మహేష్ కుమార్ గారు, ధన్యవాదాలు.
పూర్తి స్తాయి కమ్యూనిజాము, కాపటలిజం సామాన్యుడికి ఎలా ప్రమాదాలంటారు?
ఓహ్... నేను గణేష్ గారు బ్లాగ్ ఓనర్ అనుకున్నా :) అందుకే ఆయన్ని ఉద్దేశించా... :(
:):) [దేనికీ నవ్వుతున్నావూ!! అని అడగొద్దు]
>>పూర్తిస్థాయి కమ్యూనిజం-పూర్తిస్థాయి క్యాపిటలిజం రెండూ సామాన్యుడికి ప్రమాదాలే. అటూఇటూకాని మన (ప్రకాస్వామ్య) సిద్ధాంతమే బెటర్.
అందుకే ఇలా తయారయ్యావ్ కత్తీ నువ్వు. దేన్నైనా పూర్తిగా విశ్వసించాలి. పూర్తిగా ఇంప్లిమెంట్ చెయ్యాలి. లేకపోతే దేశమే నీలా అయ్యే ప్రమాదం ఉంది. ననన!!
>>బాటసారి said...
మహేష్ కుమార్ గారు, ధన్యవాదాలు. పూర్తి స్తాయి కమ్యూనిజాము, కాపటలిజం సామాన్యుడికి ఎలా ప్రమాదాలంటారు?
నేచెప్తా కత్తి తరపున -
*బాటసారి, నీకు బొత్తిగా విజ్ఞానం లేదు. ముందు చరిత్ర చదువ్* ఎందుకూ అని అడక్కు, చెప్పింది చెయ్య్..
జై కత్తి
అనానిమస్, ఇది చాలా అన్యాయం. మంచి పద్దతి కాదు. మీకు పైన కామెంటినవాళ్ళతో ఏమన్నా ఉంటే వాళ్ళ బ్లాగ్ కి వెళ్ళి తేల్చుకోండి. క్షమించండి మీకు పరకాయ ప్రవేశం వచ్చని నాకు తెలియదండి.. మీ సమయం కూడా విలువైనదే కదండి
Post a Comment