నా జీవితం లో ఇంత వరుకు కధలు కానీ కవితలు కానీ ఎప్పుడూ వ్రాయలేదు
ఈ బ్లాగ్ అనే వింత సాధనం ద్వారా అది సాధ్యం అవుతుంది
మొదటగా కవిత్వం పని పడతా.
వ్రాద్దామనగానే , దేని గురించి వ్రాయాలా అన్న మీమాంస
పామరులకు ఇది ఒక పట్టాన గోచరించదు , ఎందు కంటే కళాదృష్టి కూసింత తక్కువ కదా
ప్రపంచ కవులకు కవయిత్రలకు క్షమాపనలతో :--
సమస్యల వలయంలో చిక్కుకున్న ఓ నేస్తమా
నా స్వాంతన వచనాలు నిన్ను నిమ్మళించేనా
ఏమని చెప్పను ఎలా ఓదార్చను ఆ కల్లోలిత హృదయాన్ని
కష్టనిష్టూరాలు ఎంతటి మనిషికైనా ఎదురయ్యేనా
మహిమాన్వితుడినేని సమస్యలు మటుమాయం చేయనా
మానవమాత్రుడిని ఊరడించుట కన్నా ఏమి చేయగలను
Wednesday, June 4, 2008
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
మీ నేస్తం ఎవరోగానీ ఎంతటి అదృష్టం ఇంతగా తల్లడిల్లే మిత్రుడు వున్నందుకు. స్నేహం అందుకే ప్రేమకన్నా బలీయమైనదేమో.
Post a Comment