ఆష్ట్రేలియన బాండ్ 1956 ఇటాలియన్ పాట ఆధారంగా చేసినది. బీట్ చాలా నచ్చింది. ముఖ్యంగా ఒక నిమిషం తరువాత వచ్చే బీట్.
Band Yolanda_Be_Cool
Saturday, January 29, 2011
Friday, January 28, 2011
మారతాన్ పరుగు -- పరుగుతో బాటు ఒక బృహత్తర కార్యం
మూడవ మారతాన్ పరిగెడుతున్నాను April 30th
ఈ సారి పరుగుతో బాటు ఒక బృహత్తర కార్యం చేపట్టాను. గొడిచెర్ల మా స్వంత ఊరు. అక్క్డడ ఉన్నా ప్రాదమిక పాఠశాలను మెరుగుపరుద్దామనుకుంటున్నాను. ఇంత కష్టపడి 50 కిలోమీటర్లు పరిగెడుతున్నాను కదా. ఆ కష్టాన్ని చెప్పుకుని స్నేహితులు, చుట్టాల దగ్గర డబ్బులు గుంజుతున్నాను (ఉన్నంతలో ఉదారంగా ఇస్తున్నారు)
నేను నా స్నేహితులు కలిసి బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ అనే ఒక సంస్థను స్తాపించాము ఓ పది సంవత్సరాల క్రింద . మేము ఇప్పటివరకు ఏమి చేసామో ఆ వివరాలు ఇక్కడ చూడవచ్చు www.bighelp.org !
మా ప్రాజెక్ట్స్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోనూ ఉన్నాయి
రమారమిగా మన గ్రామాలలో పాఠశాలలు ఇదేవిదం గా ఉన్నాయి
ఎదురుగా కనపడుతున్న అరుగు మీద పేకాటరాయుల్ల పారాయణం సాగుతుంది. ఫొటో తేసే సమయానికి ఎవ్వరూ లేరు. చూసే అదృష్టం మీకు లేదు ప్చ్చ్చ్ !!!!!!!
ఇదీ ఆ పాఠశాల
నా ప్రయత్నాలు ఎలా సాగుతున్నాయో, పాఠశాలకు ఏ విధమైన మార్పులు చేర్పులు చేస్తున్నామో చెప్తూ ఉంటాను
spending money on infrastructure is very easy. But improving the quality of education is the toughest part. Lack of teachers and the absenteeism of the teachers compound the problems.
Poorest of poor kids are attending our schools in the village.
They deserve a better schooling. It is our responsibility to make sure that it happens

Tuesday, January 25, 2011
మనమేమి చేసాం మన దేశానికి మన ప్రాంతానికి, మన ఊరికి
ఈ పోష్టును విమర్శగా కాకుండా, క్రియాత్మకంగా, నిర్మాణాత్మకంగా తీసుకోవాలని ప్ర్రార్ధన.
ప్రతీ గణతంత్రరోజుకు శుభాకాంక్షలు చెప్పుకుంటాం. నెలలు గడుస్తాయి, స్వాతంత్ర్య్ దినోత్సవం వస్తుంది అది జరుపుకుంటాము. ఇలా సంవత్సరాలు గడుస్తుంటాయి. మనకి వయసు పెరుగుతుంటుంది. మన అభివృద్ది చూసుకుంటూ ఉంటాం. మన సంపద, మన సుఖాలు అంతా మనే నడుస్తుంటుంది.
ఒక నిమిషం ఆగి ఒక ప్రశ్న వేసుకుందాం. మనమేమి చేసాం మన దేశానికి అని.
మీ వంతుగా మీ జీవితంలో ఏమి చేసారు దేశం కొరకు ఇంతవరకు, చెప్పండి. ఒక వేళ ఇప్పటి వరకు చెయ్యకపోయినా, ఒకటి రెండు సంవత్సరాలలో ఏమన్నా చేద్దామనుకుంటున్నా చెప్పండి. కుతూహలంగా ఉంది. మీరు చెప్పేవి వేరందరికీ స్పూర్తినిస్తాయి.
ఏమన్నా చేయగల అవకాశం ఉందేమో అని ఆలోచించండి.తప్పకుండా ఏదో ఒకటి ఉంటుంది మీరు చేయగలిగింది.
నీకెందుకు చెప్పాలి అని అడుగుతున్నారా?
ఇష్టం లేకపోతే నాకేమి చెప్పక్కర్లేదు.మీకు మీరే ఆలోచించుకుని మీతోనే చెప్పుకోండి ఏమి చేసారో.
అసలు దేశానికే నేను చెయ్యాల్సిన అవసరమేమిటంటారా? అదే, నా కేమి పని అని?
దేముడిని నమ్ముతారనుకోండి -- పుణ్యం వస్తుంది అని చెప్తాను
దేముడిని నమ్మరనుకోండి -- పేరు ప్రతిష్ఠలొస్తాయి అని చెప్తాను
ఏహ్ చల్ తియ్ , ఏందీ లొల్లి అన్నారనుకోండి -- దానికి సంజాయించే తరీఖా అలగ్ ఉంది. అది ఇప్పుడు చెప్ప.
నేను సంపాదిస్తూ, ఆ సంపాదనను ఖర్చు పెడుతూ, దుకాణాలను పోషిస్తూ, ఆర్దికవ్యవస్త నడవటానికి సహయపడుతున్నాని మాత్రం చెప్పొద్దు. అది కాకుండా ఇంకేవైనా. నేను దేశపరిస్థుతల గురించి తిండి నిద్రలు మానేసి బాధ పడుతుంటాను కూడా పని చెయ్యదు. రాజకీయ నాయకుల అవినీతి, అసమర్దత, దగుల్బాజీతనం, బేవార్సు తనం గురించి నిప్పులు చెరుగుతాను కూడా, నయి జాంతా. ఇవి కాకుండా వేరేవి చెప్పండి.
It need not be a physical act. Any thing that helped the country, anything that lays the foundation for a better future
ఇదంతా చదివిన తరువాత మీకు వచ్చే మొదటి ప్రశ్న : నువ్వు ఇన్ని కబుర్లు చెప్తున్నావు కదా, నువ్వేమి పీకేవని? (ఓ ఐదేళ్ళ క్రితమైతే , నువ్వేమి చేసావని అడిగే వాళ్ళు, ఇప్పుడు భాష మారింది , అంతా పీకుడే)
నా వంతుగా నేనేమి చేసానో, చేయబోతున్నానో చెప్తాను చివరాఖరున.
జై హింద్

ఎముకలు కొరికే చలిలో నా పరుగు
గత మూడు సంవత్సారాలుగా పరిగెట్టడం ప్రారంభించాను. వేసవకాలంలో పరుగు పర్వాలేదు కానీ శీతాకాలంలో బయట పరుగెట్టటం ఒక సాహసం. పరుగు యంత్రం (ట్రెడ్ మిల్) మీద గంటలు గంటలు పరిగెత్తడం విసుగు.
ఇంతక ముందు పరుగులన్నీ ఒక ఎత్తైతే, మొన్న వారాంతం (వీకెండ్) పరిగెట్టిన రెండు గంటలు ఒక మేలితావు. భయంకరమైన చలిలో పరుగు
సమయం -- ఉదయం 8 గంటలకు
ఉష్ణోగ్రత -- 5 degrees farenheit (-15 degrees centigrade)
గాలి ఉత్సాహం (wind chill) -- వీసే గాలికి చలి ఇంకా ఎక్కువ అనిపిస్తుంది, ఉష్ణోగ్రత ఇంకా పడిపోతుంది
(ఇలాంటి చలిలో కోటు లేకుండా పదినిమిషాలు బయట నిలబడితే ముక్కు కానీ , చెవి కానీ విరిగిపడుతుందని చెప్తారు,(నేను ప్రయత్నించలేదు కాబట్టి నాకు అనుభవపూర్వకంగా తెలియదు))
చలికి సరి పడిన వస్త్రాలు వేసుకుంటాం కాబట్టి అంత కష్టం అనిపించదు. పరుగు మొదలుపెట్టిన ఐదు నిమిషాలు కొంచం కష్టంగా ఉంటుంది కానీ, తరువాత శరీరం నుంచి పుడుతున్న ఉష్ణం అలవాటు చేస్తుంది. తరువాత పరుగులో పడి చలి మర్చిపోతాం.చలికి తోడు, దారిలో ఉన్న గడ్డకట్టిన మంచుకి దొరికిపోకుండా చూసుకోవాలి. జారితిమిపో, నడ్డి విరుగుట కాయం.
హాయిగా ముసుగుతప్పి పడుకోక, ఇదంతా అవసరం అంటారా? నేనూ పూర్వాశ్రమంలో, చలిగా ఉందని, ముసుగుతన్ని కార్యాలయం (ఆఫీస్) కు ఎగనామం పెట్టిన రోజులు కోకొల్లలు. దేశాలు మారినా, ఖండాలు మారినా, పుట్టకతో వచ్చిన బుద్ది కాబట్టి తూచాతప్పక పాటించేవాడిని.
పరుగు అంతా అయినతరువాత వచ్చే సంతృప్తి వెలలేనిది. మొన్న చేసిన సాహసకార్యం చాలా సంతృప్తినిచ్చింది.
మరి నా కోరి తెచ్చుకున్న కష్టాలు చదివారు కదా , నా గురించి జాలిపడుతూ మీరు ఉంటున్న వెచ్చటి వాతావరణం లో , ఓ నడకకో పరుగుకో వెళ్ళొచ్చు కదా. కాస్త లేవండి మరి.

Sunday, January 23, 2011
తెలుగు బ్లాగ్ గేట్ - పెద్ద కుంభకోణం - కుకుదారుడు
నాకు కుంభకోణం కుట్రదారుడికి (కుకుదారుడు) ఏ విధమైన పరిచయం లేదు, వైరం లేదు , never crossed paths.
నేను ఒక సగటు బ్లాగ్ చదువరిని. వళ్ళు బద్దకం వల్ల వ్రాయటం అతి అరుదుగా జరుగుతుంటుంది. నేను చదివే కొన్ని బ్లాగులలో కుకుదారినివి కూడా వున్నాయి.
ఏ మాటకామాట చెప్పుకోవాలి. కుకుదారుడు చాలా తెలివైన వాడు, విజ్ఞానవంతుడు. తెలుసుకున్న విషయాలనుంచి, వివిధ పాత్రలను సృష్టించి , తెలుగు సినిమా డైరెక్టర్లకంటే గొప్పగా వాటిని దేశ విదేశాలు తిప్పి, ఒక అఖండ కావ్యం చేసాడు. అది మటుకు మెచ్చుకో దగ్గ విషయం.
ఎంత మందిని మోసం చేసాడు, ఏమి మోసాలు చేసాడు నాకు తెలియదు. ఎవరికీ తెలియకపోవచ్చు ఎందుకంటే మనల్ని ఒకరు అడ్డంగా మోసం చేసారని చెప్పుకోలేక పోవటం చాలా సహజం. మన అహం అడ్డు వస్తుంది. In this saga, everybody was taken for a ride, some more some less.
As days pass by, perpetrator will be part of history. He will try to resurrect himself in different avatars. Even during these days of damage control, he will not sit quite, he will adopt different strategies. (ఇదంతా తెలుగులో చక్కగా వ్రాయటం రాలేదు)
ఇప్పటికైనా కుకుదారుడు , తన మోసాన్ని గ్రహించి (ఇది జరగకపోవచ్చు) , తన ప్రతిభను తన, తన కుటుంబ అభివృద్దికి ఉపయోగించుకుంటాడని ఆశిస్తున్నాను.
జరిగినవి, బయట పడిన తరువాత బ్లాగ్జనుల ప్రతిస్పందనలు, కొత్త కొత్త పాత్రల ప్రవేశం,గుంపు లో ఉన్నప్పుడు మన ఆలోచన విధానం, ఒక తటస్థ ప్రేక్షకుడిగా నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి, బద్దకాన్ని వదిలించి ఈ పోష్టుని వ్రాయించాయి.
-- (ఈ కుంభకోణం గురించి తెలియని వారికి -- ఒక కుకుదారుడు , వివిధ అవతారాలతో ఒక విషవలయాన్ని సృష్టించి జనాలను మోసం చెయ్యటం అదన్న మాట)
గమనిక : నా అభిప్రాయంలో తెలుగు బ్లాగ్ వాతావరణం అహ్లాదకరంగా లేదు. పరస్పర దూషణలు, బూతులు, ఒకరినొకరు గౌరవించుకోకపోవటం గర్హనీయం. అందరూ చదువుకున్న వారే కదా, మన విలువైన సమయాన్ని ఇలా ద్వేషపూరితంగా వృధాచెయ్యటం మనకే నష్టం . (ఇది ఎవరినీ ఉద్దేశించినది కాదు, నా పరిశీలన మాత్రమే)
Waiting for the next blog shobaraj

Wednesday, January 19, 2011
తెలుగు బ్లాగ్ గేట్ - పెద్ద కుంభకోణం
తెలుగు బ్లాగ్ గేట్ అంటే ఏదో కొత్త సంకలిని అనుకునేరు. అదేమి కాదు. పెద్ద పెద్ద కుంభకోణాలకు, మోసాలకు అమెరికాలో గేట్ అని వెనకాల తగిలిస్తారు. Watergate తరువాత ప్రారంభం అయ్యింది ఈ ఆనవాయితి. అందుకే ఈ బ్లాగ్ కుంభకోణానికి వెనుక గేట్ చేర్చా.
తెలుగు బ్లాగ్ జనులను మభ్యపెడ్తున్న నాటకానికి తెర పడింది ఈ రోజు. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాను, ఎప్పుడు ఈ భండారం బట్ట బయలు అవుతుందని. తమకి ఉన్న తెలివితేటలను అమాయకప్రజలతో ఆడుకోవటానికి కాకుండా, మంచి పనులకో, తమ అభివృద్దికో ఉపయోగించకుండా, ఇలా వేరు వేరు పేర్లతో ఒక మాయాజాలాన్ని సృష్టించి ఏమి బావుకున్నారో నాకైతే అర్ధం కాలేదు.
తెలుసుకున్న వారంతా విభ్రాంతి చెందుతారు, భాధ పడతారు, కొందరు అసహ్యించుకుంటారు
భారతీయ గూడచారి విభాగం లో పనిచేసే మేజర్ చంద్రకాంత్ నాకు చెప్పిన దాని ప్రకారం ఈ గూడుపుఠాణంతా గుంటురు లో ఒక IP address నుంచి జరిగిందంటా. ఏమిటి నమ్మట్లేదా, ఆ పేరు చెప్పగానే మీకు అన్నగారి సినిమా గుర్తు వస్తుందా. నా ఖర్మ, ఇదికూడా గొప్పగా చెప్పటం రావట్లేదు. దేనికైనా talent ఉండాలి.
PS: Forgot to tell you, I am just typing this from the meeting of Goldman Sachs and Reliance group on a two billion dollar buyout deal. (dont you believe me, ??)

Subscribe to:
Posts (Atom)