దేశం అభివృద్ది చెందుతుంది అని వెర్రి కేకలేస్తున్నారు
దేశం పురోగతి ఎవ్వరు ఆపలేరు అని గర్వపడుతున్నారు
వర్దమాన దేశాలలో కలిసిపోతుంది అని ఆనందపడుతున్నారు
మా బక్కచిక్కిన పల్లెటూరి ప్రాణాలకు అలా కనబడదే దేశం,తేడా ఎక్కడ
మా మసకబారిన కళ్ళలోనా , మీ హాయి జీవితాలాలోనా
నగల కొట్టు రద్దీని దేశాబివృద్ది అనుకొనే మీ ఆలోచనా పరిధి లోనా లేక,
కుటుంబానికి కడుపు నిండా కూడు పెట్టలేని మా నిస్సహయాత లోనా
పందులు తిరిగే ప్రాధమిక పాటశాల కెల్తూ కలక్టేరు అవుతానుకునే మా బుడ్డోల్ల అమాయకత్వంలోనా
పదో తరగతి వెలగబెట్టి వ్యవసాయం నామోషి అనుకునే మా కుర్రకారు మెరిసే కళ్ళేనా
వెడల్పాటి రహదార్లో మీ చిన్న కారులో ప్రయనిస్తూ అమెరికాలో ఉన్నామనుకునే మీ ఊహ సౌధాలేనా
కష్టాలేమని చెప్పాలి ఎన్నని చెప్పాలి, ఎవరిని నిందించాలి
పండించిన పంటకు కనీసం గిట్టుబాటైనా దొరకని దౌర్భగ్యం
కల్తీ విత్తనాలను మాకు అంటగట్టి కోట్లకు పడగలెత్తుతున్న దళారినా
అరికట్టలేని , తెల్లదొరలకంటె హీనం గా చూసే పోలీసునా
ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోకుండా దేశాన్ని కొల్లకొడుతున్న నీచాతినీచుడైన రాజకీయ నాయకుడ్నా
ఎవరు మాకు దారి , ఎవరు తీరుస్తారు మా కష్టాలు
మీ అభివృద్దిలో మాకు చోటు లేదు,స్వంత దేశంలోనె పరాయోల్లం
Saturday, June 21, 2008
Saturday, June 14, 2008
సంకల్ప దోషం
సంకల్పం మారుతుంది క్షణక్షణం దినదినం
ఒక క్షణం మితి మీరిన ఉత్సాహం, శూరత్వం
గడిచిన సమయం కాలం తెచ్చే అవరోధం ఆటంకం
హెచ్చు తగ్గున సాగుతున్న పయనం జీవిత సత్యం
ఒక క్షణం మితి మీరిన ఉత్సాహం, శూరత్వం
గడిచిన సమయం కాలం తెచ్చే అవరోధం ఆటంకం
హెచ్చు తగ్గున సాగుతున్న పయనం జీవిత సత్యం
Wednesday, June 4, 2008
కవితా ప్రయత్నం
నా జీవితం లో ఇంత వరుకు కధలు కానీ కవితలు కానీ ఎప్పుడూ వ్రాయలేదు
ఈ బ్లాగ్ అనే వింత సాధనం ద్వారా అది సాధ్యం అవుతుంది
మొదటగా కవిత్వం పని పడతా.
వ్రాద్దామనగానే , దేని గురించి వ్రాయాలా అన్న మీమాంస
పామరులకు ఇది ఒక పట్టాన గోచరించదు , ఎందు కంటే కళాదృష్టి కూసింత తక్కువ కదా
ప్రపంచ కవులకు కవయిత్రలకు క్షమాపనలతో :--
సమస్యల వలయంలో చిక్కుకున్న ఓ నేస్తమా
నా స్వాంతన వచనాలు నిన్ను నిమ్మళించేనా
ఏమని చెప్పను ఎలా ఓదార్చను ఆ కల్లోలిత హృదయాన్ని
కష్టనిష్టూరాలు ఎంతటి మనిషికైనా ఎదురయ్యేనా
మహిమాన్వితుడినేని సమస్యలు మటుమాయం చేయనా
మానవమాత్రుడిని ఊరడించుట కన్నా ఏమి చేయగలను
ఈ బ్లాగ్ అనే వింత సాధనం ద్వారా అది సాధ్యం అవుతుంది
మొదటగా కవిత్వం పని పడతా.
వ్రాద్దామనగానే , దేని గురించి వ్రాయాలా అన్న మీమాంస
పామరులకు ఇది ఒక పట్టాన గోచరించదు , ఎందు కంటే కళాదృష్టి కూసింత తక్కువ కదా
ప్రపంచ కవులకు కవయిత్రలకు క్షమాపనలతో :--
సమస్యల వలయంలో చిక్కుకున్న ఓ నేస్తమా
నా స్వాంతన వచనాలు నిన్ను నిమ్మళించేనా
ఏమని చెప్పను ఎలా ఓదార్చను ఆ కల్లోలిత హృదయాన్ని
కష్టనిష్టూరాలు ఎంతటి మనిషికైనా ఎదురయ్యేనా
మహిమాన్వితుడినేని సమస్యలు మటుమాయం చేయనా
మానవమాత్రుడిని ఊరడించుట కన్నా ఏమి చేయగలను
Tuesday, June 3, 2008
జీవన పయనం
గొడిచెర్ల అనే గ్రామం నుంచి బయలు దేరి సప్త సముద్రాలు దాటిన ఒక బహుదూరపు బాటసారి పయనం ఇది. ఏదేదో జీవితంలో సాదిద్దామనే తపన, కానీ ఆలోచనలకి సాధనకి ఉన్న అంతరం దుర్బేద్యం.
తేట తెలుగు భాషలో మొదటి సారిగా బ్లాగ్ లో వ్రాస్తున్న నా ఆనందానికి హద్దులు లేవు
తేట తెలుగు భాషలో మొదటి సారిగా బ్లాగ్ లో వ్రాస్తున్న నా ఆనందానికి హద్దులు లేవు
Subscribe to:
Posts (Atom)