ఈ పోష్టును విమర్శగా కాకుండా, క్రియాత్మకంగా, నిర్మాణాత్మకంగా తీసుకోవాలని ప్ర్రార్ధన.
ప్రతీ గణతంత్రరోజుకు శుభాకాంక్షలు చెప్పుకుంటాం. నెలలు గడుస్తాయి, స్వాతంత్ర్య్ దినోత్సవం వస్తుంది అది జరుపుకుంటాము. ఇలా సంవత్సరాలు గడుస్తుంటాయి. మనకి వయసు పెరుగుతుంటుంది. మన అభివృద్ది చూసుకుంటూ ఉంటాం. మన సంపద, మన సుఖాలు అంతా మనే నడుస్తుంటుంది.
ఒక నిమిషం ఆగి ఒక ప్రశ్న వేసుకుందాం. మనమేమి చేసాం మన దేశానికి అని.
మీ వంతుగా మీ జీవితంలో ఏమి చేసారు దేశం కొరకు ఇంతవరకు, చెప్పండి. ఒక వేళ ఇప్పటి వరకు చెయ్యకపోయినా, ఒకటి రెండు సంవత్సరాలలో ఏమన్నా చేద్దామనుకుంటున్నా చెప్పండి. కుతూహలంగా ఉంది. మీరు చెప్పేవి వేరందరికీ స్పూర్తినిస్తాయి.
ఏమన్నా చేయగల అవకాశం ఉందేమో అని ఆలోచించండి.తప్పకుండా ఏదో ఒకటి ఉంటుంది మీరు చేయగలిగింది.
నీకెందుకు చెప్పాలి అని అడుగుతున్నారా?
ఇష్టం లేకపోతే నాకేమి చెప్పక్కర్లేదు.మీకు మీరే ఆలోచించుకుని మీతోనే చెప్పుకోండి ఏమి చేసారో.
అసలు దేశానికే నేను చెయ్యాల్సిన అవసరమేమిటంటారా? అదే, నా కేమి పని అని?
దేముడిని నమ్ముతారనుకోండి -- పుణ్యం వస్తుంది అని చెప్తాను
దేముడిని నమ్మరనుకోండి -- పేరు ప్రతిష్ఠలొస్తాయి అని చెప్తాను
ఏహ్ చల్ తియ్ , ఏందీ లొల్లి అన్నారనుకోండి -- దానికి సంజాయించే తరీఖా అలగ్ ఉంది. అది ఇప్పుడు చెప్ప.
నేను సంపాదిస్తూ, ఆ సంపాదనను ఖర్చు పెడుతూ, దుకాణాలను పోషిస్తూ, ఆర్దికవ్యవస్త నడవటానికి సహయపడుతున్నాని మాత్రం చెప్పొద్దు. అది కాకుండా ఇంకేవైనా. నేను దేశపరిస్థుతల గురించి తిండి నిద్రలు మానేసి బాధ పడుతుంటాను కూడా పని చెయ్యదు. రాజకీయ నాయకుల అవినీతి, అసమర్దత, దగుల్బాజీతనం, బేవార్సు తనం గురించి నిప్పులు చెరుగుతాను కూడా, నయి జాంతా. ఇవి కాకుండా వేరేవి చెప్పండి.
It need not be a physical act. Any thing that helped the country, anything that lays the foundation for a better future
ఇదంతా చదివిన తరువాత మీకు వచ్చే మొదటి ప్రశ్న : నువ్వు ఇన్ని కబుర్లు చెప్తున్నావు కదా, నువ్వేమి పీకేవని? (ఓ ఐదేళ్ళ క్రితమైతే , నువ్వేమి చేసావని అడిగే వాళ్ళు, ఇప్పుడు భాష మారింది , అంతా పీకుడే)
నా వంతుగా నేనేమి చేసానో, చేయబోతున్నానో చెప్తాను చివరాఖరున.
జై హింద్